ఆఫ్రికన్లతో కలిసి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ చేసుకున్న అమోర్ ఆస్పత్రి
హైదరాబాద్‌లో తాత్కాలికంగా ఉంటున్న, స్థిరపడిన సుమారు 100 మంది ఆఫ్రికన్లు ఉత్సవాల్లో పాల్గొని, త్రివర్ణపతాకానికి సెల్యూట్ చేశారు
హైదరాబాద్, ఆగస్టు 15, 2022: నగరంలోని ప్రముఖ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి అయిన అమోర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జాతీయ భావనలతో ఘనంగా జరుపుకొన్నారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న, స్థిరపడిన సుమారు 100 మంది ఆఫ్రికన్ పురుషులు, మహిళలు కూడా ఈ సంబరాల్లో పాల్గొని, భారత త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేయడం కనులకు ఇంపుగా ఉంది.
ఈ సందర్భంగా అమోర్ ఆస్పత్రి వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కిషోర్ బి.రెడ్డి మాట్లాడుతూ, “భారతదేశ స్ఫూర్తి, మనం కలిగి ఉన్న విలువలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు భారతీయులను ఆత్మీయులను చేస్తాయి. భారతదేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని చేసుకుంటున్న సందర్భంగా ఆఫ్రికాకు చెందిన మన స్నేహితులు ఈ సంబరాల్లో పాల్గొని, మన ఉత్సాహాన్ని పంచుకోవాలనుకోవడం ఎంతో సంతోషకరం. నేను వైద్యుడిగా ప్రాక్టీసు ప్రారంభించిన తొలినాళ్ల నుంచి వివిధ ఆఫ్రికా దేశాలకు చెందిన రోగులకు చికిత్సలు చేస్తున్నాను. ఈ రోజు ఈ సంబరాల్లో పాల్గొనడం ద్వారా, వాళ్లు తమకు భారతదేశంతో ఉన్న అనుబంధాన్ని, భారతీయ ఆరోగ్య వ్యవస్థపై తమకున్న నమ్మకాన్ని ప్రదర్శించారు” అని చెప్పారు.
75 సంవత్సరాల భారత స్వాతంత్య్రం గొప్ప ఉత్సాహాన్ని తెస్తుంది. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని, తమ జీవితాలను త్యాగం చేసిన వారందరికీ ఇది ఒక నివాళి. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం ప్రారంభించిన హర్ ఘర్ తిరంగా వంటి వివిధ కార్యక్రమాలకు అమోర్ ఆస్పత్రి కుటుంబం తన సంపూర్ణ మద్దతును అందించింది. గత మూడు రోజులుగా ఆస్పత్రి భవనంపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు. ప్రతి వైద్యుడు, నర్సింగ్, సహాయక సిబ్బంది సభ్యులను వారి వారి ఇళ్ల వద్ద భారతీయ జెండాను ప్రదర్శించాలని యాజమాన్యం అభ్యర్థించింది, ఆ దిశగా వారిని ప్రోత్సహించింది.
అమోర్ ఆస్పత్రి గురించి:
పలువురు వైద్యనిపుణులు, వైద్యరంగ నిపుణులు కలిసి నాణ్యమైన వైద్యసేవలు అందించాలన్న తపన, నిబద్ధతతో ఏర్పాటుచేసినదే అమోర్ ఆస్పత్రి. అమోర్ ఆస్పత్రి ప్రధాన విలువలు దాని పేరుకు ఉన్న అర్థంతో ప్రతిధ్వనిస్తాయి. ప్రేమ, సహానుభూతి, సంరక్షణతో రోగులకు సేవ చేయడంపైనే మా దృష్టి అంతా ఉంటుంది. నాణ్యమైన చికిత్సలకు, ఆర్థిక స్థోమతకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చాలనే లక్ష్యంతో, అమోర్ ఆస్పపత్రి రోగి సంరక్షణ కోసం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించింది. డాక్టర్ కిశోర్ బి. రెడ్డి నేతృత్వంలోని అమోర్ ఆస్పపత్రి రోగ నిర్ధారణ, చికిత్సలో రోగికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఇది చికిత్స విధానాలకు వెన్నెముక లాంటిది. దీన్ని పాలనావ్యవస్థలో అంతర్భాగం చేయడం రోగులు, వారి కుటుంబాలతో మా సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి దోహదపడుతుంది.