ఆగష్టు 15 వ తేది డాలస్ లో “ఇండియన్ అమెరికన్ డే”

డాలస్, టెక్సాస్: భారతదేశ స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా డల్లాస్ నగర్ మేయర్ ఎరిక్ జాన్సన్ డాలస్ సిటీహాల్ లో కొద్దిమంది ప్రవాస భారతీయ నాయకులతో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసి ఆగస్ట్ 15 వ తేదీని డాలస్ లో “ఇండియన్ అమెరికన్ డే” గా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు.

మేయర్ జాన్సన్ మాట్లాడుతూ డాలస్, ఫోర్ట్ వర్త్ నగర పరిసర ప్రాంతాలలో దాదాపుగా 2 లక్షలమంది ప్రవాస భారతీయులు నివసిస్తూ విద్య, వైద్య, వ్యాపార, వాణిజ్య, శాస్త్ర, సాంకేతిక రంగాలలో సాధించిన ప్రగతి శ్లాఘనీయమైనదన్నారు. ఉత్తరటెక్సాస్ లో ప్రవాస భారతీయులు వివిధ వ్యాపార రంగాలలో స్థిరపడి 10 బిలియన్ డాలర్ల పైగా ఆదాయాన్ని సృష్టిస్తూ ఈ ప్రాంత ఆర్ధికాభివృద్ధికి తోడ్పడుతున్న వారందరికి హార్దిక కృతజ్ఞతలు అన్నారు.


డాలస్ నగర మేయర్ ఆత్మీయ ఆహ్వానం మేరకు ఈ ప్రత్యేక అభినందన కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాస భారతీయ నాయకులు అరుణ్ అగర్వాల్, సల్మాన్ ఫర్ షోరి, రజనీష్ గుప్తా, డా. ప్రసాద్ తోటకూరలకు మేయర్ ఎరిక్ జాన్సన్ ఆగస్ట్ 15 వ తేదీని డాలస్ లో “ఇండియన్ అమెరికన్ డే” గా గుర్తిస్తున్నట్లు ప్రకటించిన అధికారిక పత్రాన్ని ప్రదానం చేశారు.

More Press News