జయశంకర్ సార్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం: బీసీ కమిషన్ సభ్యులు సిహెచ్ ఉపేంద్ర
ఆగస్టు 6న జయశంకర్ సార్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం, సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు: బీసీ కమిషన్ సభ్యులు సిహెచ్ ఉపేంద్ర
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆజన్మాంతం కృషిచేసిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జన్మదినాన్ని ఆగస్టు 6వ తారీఖున ఘనంగా నిర్వహించి, తెలంగాణ ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జయశంకర్ సార్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్లైన్ తో 1952 నుండి తెలంగాణ వాదాన్ని బలపరుస్తూ భావజాల వ్యాప్తి, ఉద్యమాలు, రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించవచ్చని సిద్ధాంతాన్ని ప్రతిపాదించి టీఆర్ఎస్ పార్టీ స్థాపనలో క్రియాశీలక భూమిక పోషించి, నాటి ఉద్యమనేత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అన్ని సమయాల్లో వెన్నుదన్నుగా ఉంటూ కొండంత ప్రోత్సాహాన్ని అందించిన మహనీయుడు జయశంకర్ సారు అని ఆయన అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో దేశంలోనే అభివృద్ధి చెందడంలో నెంబర్ వన్ స్థానంగా ఉండాలని కోరుకున్న జయశంకర్ సారు కలలను నేడు సిఎం కేసీఆర్ గారు నిజం చేసి ఆయనకు ఘనమైన నివాళి అర్పిస్తున్నారు అని ఆయన అన్నారు.