వెహికల్ డిపోలో జరుగుతున్న ఆధునికీకరణ పనుల పరిశీలన: వీఎంసీ కమిషనర్

  • అధికారులకు ఆదేశాలు
విజ‌య‌వాడ‌: హనుమాన్ పేట నందలి వెహికల్ డిపో  ఆధునీకరణ పనుల పురోగతిని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. డిపో ఆవరణలో చేపట్టిన పనులు వేగవంతము చేసి సత్వరమే పూర్తి చేయాలని ఆదేశిస్తూ, నూతనంగా నిర్మించిన మెకానికల్ షెడ్ నందలి ఫ్లోరింగ్ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 

ఈ సందర్బంలో వాహనములు సర్వీసింగ్ చేయు ప్రాంతములో మట్టి, వ్యర్ధములతో ఆశుభ్రంగా ఉండుట గమనించి పరిసరాలు అన్నియు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తూ, సర్వీస్ పాయింట్ వద్ద డస్ట్ బిన్ ఏర్పాటు చేసుకొని వాహనములు సర్వీస్ చేసిన వెనువంటనే వచ్చు వ్యర్ధములను అన్నియు బిన్ నందు వేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్బంలో నూతనముగా కొనుగోలు చేసి డిపోలో ఉన్న స్వీపింగ్ మిషన్ మరియు డ్రెయిన్లను శుభ్రం చేయు నాళ మ్యాన్ వాహనములను క్షేత్ర స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. వెహికల్ డిపో ప్రహరి గోడకు పెయింటింగ్ నిర్వహించాలని మరియు డిపోకు వచ్చు ప్రధాన ద్వారం వద్ద ఏవిదమైన వాహనములు పార్క్ చేయకుండా చూడాలని అన్నారు. తదుపరి ఏలూరు కాలువ వెంబడి గల గోరా పార్క్ ను సందర్శించి పార్క్ యొక్క సిత్దిగతులు మరియు నిర్వహణ తీరును పరిశీలించారు.

పర్యటనలో  సూపరింటిoడెండింగ్ ఇంజనీర్ (వర్క్స్) పి.వి.కె భాస్కర్, స్టోర్స్ ఇన్ ఛార్జ్ యోగేంద్ర  మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.  
VMC

More Press News