గాంధీ హిల్ సందర్శన.. అధికారులకు పలు సూచనలు చేసిన వీఎంసీ కమిషనర్

విజ‌య‌వాడ‌: నగర పర్యటనలో భాగంగా కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గాంధీ హిల్ నందలి ప్లానిటోరియం ను సందర్శించి దానిలో ఫోటో గ్యాలరీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్లానిటోరియం నందు ఫోటోలు ఏర్పాటు చేయుటకు అవసరమైన ఫోటో ఫ్రేమ్ మరియు ఫోకస్ లైట్స్ ఏర్పాటు చేయుటతో పాటుగా గాంధీ హిల్ ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలు అన్నియు పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని సంబందిత అధికారులకు సూచించారు.

ప్లానిటోరియంనకు అవసరమైన పెయింటింగ్ పనులు చేపట్టి, ప్లానిటోరియం హాల్ చుట్టూ ఉన్న వరండాలో కొంత భాగం లైబ్రరీ బుక్స్ ఏర్పాటు చేయునట్లుగా చూడాలని అన్నారు. అదే విధంగా గాంధీ హిల్ అభివృద్ధి కి సంబందించిన అంచనాలను రూపొందించాలని, కాంపౌండ్ వాల్ నందలి గ్యాప్ ఫిల్లింగ్ పనులు చేపట్టాలని అన్నారు. కొండ పై భాగములోని జాయ్ ట్రైన్ ట్రాక్ మరమ్మత్తుల పనులు నిర్వహించాలని పేర్కొన్నారు.

తదుపరి కాళేశ్వరరావు మార్కెట్ వద్ద లో బ్రిడ్జి లో పల్లముగా ఉండుట వల్ల కాలువ నందలి నీరు నిల్చియుండకుండా వాల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నగరపాలక సంస్థ కు సంబందించిన ఎయిర్ టెక్ వాహనములకు కలర్ కోడ్ ప్రకారం పెయింటింగ్ నిర్వహించాలని అధికారులకు సూచించారు.

పర్యటనలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి. సత్యవతి, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర్ రావు, ఎస్.ఇ పి.వి.కె భాస్కర్, డిప్యూటీ సిటి ప్లానర్ (ప్లానింగ్ ) జుబిన్ శిరన్ రాయ్, ఎగ్గిక్యుటివ్ ఇంజనీర్ ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, ఏ.డి.హెచ్ శ్రీనివాస్ మరియు గాంధీ హిల్ ఫౌండేషన్ ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో ప్రతి ఒక్కరు స్వచ్చందంగా భాగస్వాములై విజయవంతము చేయాలి:
పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 181 , 182 సచివలయలకు సంబందించి కొత్తపేట చేపల మార్కెట్ వద్దన గల షాదీ ఖానా నందు ఏర్పాటు చేసిన ఆజాదీ కా అమృత్ మహోత్సవముపై ప్రజలకు అవగాహన కార్యక్రమములో శాసన సభ్యులు వెల్లంపలి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి) గారితో కలసి పాల్గొన్నారు. ముందుగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియ సచివాలయ సిబ్బందితో కలసి 50 మీటర్ల పొడవు గల త్రివర్ణ పతాకముతో ర్యాలి నిర్వహించారు.

తదుపరి షాదీ ఖానా నందు జాతిపిత మహత్మా గాంధీ గారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళ్ళు అర్పించి  విజయవాడ నగరపాలక సంస్థ అద్వర్యంలో  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నేటి నుండి 15వ తేది వరకు నగరంలో చేపట్టిన వివిధ కార్యక్రమములలో ప్రజలందరూ స్వచ్చందంగా భాగస్వాములై విజయవంతము చేయాలని శాసన సభ్యులు వెల్లంపలి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి పిలుపునిచ్చారు.

ఈ సందర్బంలో కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ వార్డ్ సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఒక్కరులో దేశ భక్తిని నింపే విధంగా డివిజన్ పరిధిలో పలు కార్యక్రమములను నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వటం జరిగిందని, సచివాలయ సిబ్బంది ద్వారా ప్రభుత్వం ద్వారా ఇంటింటికి జాతీయ జెండాలను ఉచితంగా పంపిణి చేయుట జరుగునని,  13వ తేది నుండి 15వ తేదివరకు ప్రతి ఇంటిపై సదరు జండా ఎగురవేయాలని సూచించారు. అదే విధంగా 15వ తేదీవరకు నిర్వహించనున్న కార్యక్రమము అందరు పాల్గోనాలని అన్నారు.

కార్యక్రమములో శాంతి కల్చరల్ సొసైటి కళాజాతర బృంద  దేశ భక్తీ గేయాల ఆలపించగా కార్యక్రమములో జోనల్ కమిషనర్ సుధాకర్, ఎగ్గిక్యుటివ్ ఇంజనీర్ నారాయణమూర్తి, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు.సి.డి) శకుంతల మరియు ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది స్థానికులు పాల్గొన్నారు.

స్పందనలలో 26 అర్జీల రాక - ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి: నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

ప్రజాసమస్యల పరిష్కార దిశగా ప్రతి సోమవారం న‌గ‌ర పాల‌క సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నిర్వహించారు. ప్రజలు ఎదుర్కోను సమస్యలపై వచ్చిన అర్జీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమస్య పునరావృతం కాకుండా వేగవంతముగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. స్పందన కార్యక్రమములో ప్రధానంగా పట్టణ ప్రణాళిక – 12,  ఇంజనీరింగ్ – 4, పబ్లిక్ హెల్త్ విభాగం –2, ఎస్టేట్ విభాగం – 1, యు.సి.డి – 1, రెవిన్యూ – 5, జోనల్ కమీషనర్ - 1 అర్జీలు వచ్చినవి.

Sl.NoNAME OF THE PETITIONER, ADDRESS PHONE NUMBERSUBJECTDEPARTMENT
1K.MADHAVARAO, 217,VASTRALATHA, ONETOWN9247111541 ADJUSTMENT OF VLT EXCESS PAID AMOUNTDCR
2TV.NARASIMHA RAO, 21-11/14-7, MADHURA NAGAR.9440883563WATER TAX ADJUSTMENT.CE
3R.KISHORE KUMAR. BLOCK NO:6, FLOT NO:22.9849180066NEIGHBOURS BATHROOM WATER LEAKAGE PROBLEM.CP
4MA.FAROOQ, 12-4-128, TARAPET.9346210825UNAUTHORISED CONSTRUCTION.CP
5K.LAKSHMI NARAYANA, 32-42-57, CHUTTUGUNTA.9849271141REQUEST FOR PROPERTY VALUE CERTIFICATE.DCR
6B.LAKSHMI PADMAVATHI, 21-9/4-5, MADHURA NAGAR,9491349989REQUEST FOR PROPERTY VALUE CERTIFICATE.DCR
7G.SUREAMANYA SARMA.9866385725REQUESTING FOR PROPERTY TAX EXAMPTION.DCR
8A.SUBRAHMANYESWARA RAO, 23-11-120, SN PURAM.9247155411REQUESTING TO STOPPAGE OF MY NEIGHBOURS UNAUTHORISED CONSTRUCTION.CP
9PV.SESHAGIRI RAO, 21-37-81, OPP RAGHAVAIAH PARK.9246775839REQUESTING FOR PT INTEREST SETLEMENT.DCR
10D.BHAVANI, BLOCK NO;240, GF:5.9441415541REQUESTING FOR REMOVAL OF UNAUTHORISED SHOP ON ROAD SIDE.CP
11B.RAMA KRISHNA, 49-1-47, ELURU ROAD.9246181498REQUESTING FOR SHOP REOPEN.CP
12G.VENMENDRA, 43-106/1-17B, SINGH NAGAR.9248014008DUST PROBLEMCMOH
13C.BHAGYA LAKSHMI, 1-3/4-26, VIDYADARA PURAM.8333899714COMPLIENT AGAINST CH. VANI WORKING IN SACHIVALAYAM AS RP.ZC
14V. RAMANA, 42-87-9/A, SINGH NAGAR.8978725318APCOS JOBCMOH
15LK. RAMA RAO, 27-7-27, GOVERNER PET.9848466813PERMISSION FOR DEMOLUTION OF OLD BUILDING.CP
16K.SAILAJA. 33-8-4,SEETHA RAM PURAM.9966439992ROAD WINDING PROBLEMCP
17N.GEETHA VANI, 61-21-7/9, KRISHNA LANKA.9491924069TIDCO HOUSE.POUCD
18P.SUVARNA RAO, 47-28-5/22, RANIGARI THOTA.8686836884REQUESTING FOR VOLUNTARY SALARY.CP
19G.SIRISHA, 44-14-13/2, GUNADALA.9391326384ROAD OCCUPIDE  PROBLEMCP
20M.JAGGA RAO, 10-15-7/2, MALLIKARJUN PET.9666847966REQUESTING FOR AUCTION OF ANSARI PARKING STAND.ESTATE
21SD. ASHA, 17-21-23/9, PEZZONNI PET.9959792276SON DEATH INFORMATION SUBMITTED.CE
22G.DEVI PRASAD SHARMA, RR WA 318, RAMA KRISHNA PURAM.8500542898 ILLIGAL CONSTRUCTION PROBLEMCP
23K.JAYA KUMAR, 175/4, BHAVANI PURAM.9705046464WATER LEAKAGE PROBLEM .CP
24SK.RAHEMAN SYED, 4-3/1-89, CHITTI NAGAR.7416780511REQUESTING FOR REMOVE THE WATER DEMAND IN DEMAND NOTICE.CE
25M.VAMSI LAL RATHOD, 43-147-33, PAIPUL ROAD.9491069380REQUEST FORLAY OF  ROADCE
26CHK. RAMA RAO, 1-3/2-21, FOUR PILLER CENTRE.9390444449ROAD OCCUPIDECP
 
కార్యక్రమంలో అదనపు కమిషనర్(జనరల్) యం.శ్యామల, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, జాయింట్ డైరెక్టర్ (అమృత్) డా.కె.బి.ఎన్.ఎస్ లతా, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ i/c డా.సి.హెచ్ బాబు శ్రీనివాసన్, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, సిటీ ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్,  ఎస్టేట్ అధికారి కె.అంబేద్కర్ మరియు ఇతర అధికారులు  పాల్గొన్నారు.

More Press News