ఎట్టిపరిస్థితిల్లోనూ ప్రాణ నష్టం కలుగ కూడదు: తెలంగాణ సీఎస్
- భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సీఎస్ సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్
ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం ఏర్పడకుండా జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు. వరుసగా రెండు రోజులు సెలవు రోజులు వస్తున్నందున, జిల్లాల్లోని అధికారులు సెలవులను ఉపయోగించకుండా సహాయ, పునరావాస కార్యక్రమాలలో పాల్గొనేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. పొరుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నందున వరదలు అధికంగా వచ్చే అవకాశం ఉందని, ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని రిజర్వాయర్లు, చెరువులు పూర్తిగా నిండినందున చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఎక్కడైతే రహదారులు, బ్రిడ్జిలు తెగాయో, ఆమార్గాల్లో ప్రమాదాలు జరగకుండా వాహనాలను, ప్రయాణకులను నిలిపి వేయాలని, ఈ విషయంలో పోలీసులతో సమన్వయము చేసుకోవాలని పేర్కొన్నారు.. పోలీసు, నీటి పారుదల, రోడ్లు భవనాలు, విధ్యుత్, రెవిన్యూ తదితర శాఖల లన్నీ మరింత సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
మరింత స్వచ్ఛమైన తేనే 'గిరి నేచర్' ల ను మార్కెట్ లో విడుదల చేసిన గిరిజన సహకార సంస్థను అభినందించిన సీఎస్ సోమేశ్ కుమార్:
ఈ తేనే ఉత్పత్తుల్లో మొదటిసారిగా మామిడి తేనే, వేప తేనే, నువ్వుల తేనే, పాల కొడిశ తేనే లను వేర్వేరుగా విక్రయిస్తోంది. రాష్ట్రంలో ఫ్లిప్ కార్డు, క్యూ- మార్ట్ ల ద్వారా ఈ తేనే ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేయవచ్చని క్రిస్టినా జోంగ్టు తెలిపారు. ఇప్పటివరకు గిరిజనులను ముఖ్యంగా చెంచు గిరిజనులు కిలో తేనేకు రూ.220లు పొందే వారని, దీనితో 54శాతం అదనపు ఆదాయాన్ని పొందుతారని సీఎస్ కు వివరించారు. కాగా, గిరిజనుల ఆదాయాన్ని పెంపొందించడమే కాకుండా ప్రజలకు మరింత స్వచ్ఛమైన తేనే ఉత్పత్తులను అందుబాటులో తేవడంపట్ల గిరిజన సంక్షేమ శాఖ, గిరిజన సహకార సంస్థను అభినందించారు.
అడవుల్లో సేకరించిన ఈ మామిడి తేనే, వేప తేనే, నువ్వుల తేనే, పాల కొడిశ తేనే రకాల వేర్వేరు తేనే ఉత్పత్తులను ఏవిధమైన రసాయనాలతో ప్రాసెస్ చేయకుండా స్వచ్ఛమైన ఉత్పత్తులను అదేవిధంగా ప్రజలకు అందుబాటులో తేవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య పరమైన లాభాలుంటాయి.
ఈ తేనేలు పాలీఫెనాల్స్ అని పిలువబడే విభిన్న బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుందని. ఇవి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, యాంటీఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, రోగనిరోధక శక్తిని పెంచే ప్రభావాన్ని కలిగి ఉంటాయి. జలుబు, గొంతు నొప్పి, చర్మ వ్యాధుల నివారణకు తేనే మంచి ఔషధంగా పనిచేస్తుంది.