తానా ప్రపంచ సాహిత్య వేదిక వీడియోలు ఇవిగో..

తెలుగు భాషాభిమానులకు, సాహితీప్రియులకు నమస్కారం!

తానా సంస్థ సాహిత్యవిభాగంగా మే, 2020 న ఏర్పడ్డ “తానా ప్రపంచసాహిత్యవేదిక” ‘నెలానెలా తెలుగువెలుగు’ పేరిట విభిన్న సాహిత్యాంశాలతో ప్రతినెల ఆఖరి ఆదివారం (భారతకాలమానం ప్రకారం రాత్రి 8:30 లకు) మేము నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశాలకు మీరు చూపిస్తున్నఆదరణకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు.

మీ విశేష ఆదరాభిమానాలు, సూచనలు, సలహాలతో “తానా ప్రపంచసాహిత్యవేదిక” నేడు ప్రపంచంలోనే ఒక అగ్రగామి సాహిత్యసంస్థగా రాణిస్తోంది. 

ఈ ఉన్నతస్థితికి ఎదగడానికి దోహదపడిన తానా కార్యవర్గసభ్యులకు, కార్యకర్తలకు, సాహితీ ప్రియులకు, ప్రసార మాధ్యమాలకు మా వినమ్రపూర్వక ప్రణామములు.

మే 2020 నుండి జూన్ 2022 వరకు విభిన్న సాహిత్య అంశాలపై మా వేదికను పంచుకున్న వందలాదిమంది సాహితీవేత్తలతో కూడిన మొత్తం 36 (ప్రత్యేక కార్యక్రమాలతో కలిపి) సాహిత్యకార్యక్రమాల యూట్యూబ్ లంకెను ఈ క్రింద పొందుపరుస్తున్నాము. 

మీకు వీలున్నప్పుడు వీక్షించగలరు.

https://www.youtube.com/playlist?list=PL0GYHgMt2OQzhobYN7BUnlSR9LBS7Xlm8 




 సాహిత్యాభివందనం,

లావు అంజయ్య చౌదరి, తానా అధ్యక్షుడు
డా. ప్రసాద్ తోటకూర ,  తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకుడు  
చిగురుమళ్ళ శ్రీనివాస్ , తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త

More Press News