జగనన్న ఇళ్ళ లే అవుట్లను పరిశీలించిన వీఎంసీ కమిషనర్
- అధికారులకు పలు ఆదేశాలు
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులతో కలసి వెలగలేరు, కొండపాలూరు, ప్రాంతాలలో జరుగుతున్న పనులను గురువారం పరిశీలించారు. పట్టణ ప్రాంతములలోని నిరుపేదలకు సొంతింటి కలను నేరవేర్చేoదుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకoగా జననన్న గృహ నిర్మాణ పథకం క్రింద అర్హులైన పేద ప్రజలకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేయటం జరిగిందని అన్నారు. లే అవుట్లో లబ్దిదారులు గృహా నిర్మాణం చేపట్టేందుకు అవసరమగు కనీస సౌకర్యాలైన విద్యుత్, త్రాగునీరు, రోడ్లు, డ్రెయిన్లు వంటి మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. అదే విధంగా లబ్దిదారుతో సమావేశం నిర్వహించి వీలైనంత మంది గృహ నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
పర్యటనలో అదనపు కమిషనర్(ప్రాజెక్ట్స్) కె.వి.సత్యవతి, సూపరింటిoడెండింగ్ ఇంజనీర్ (వర్క్స్) పి.వి.కె భాస్కర్, హౌసింగ్ సిబ్బంది మరియు సచివాలయ సబ్బంది తదితరులు పాల్గొన్నారు.