రోడ్ నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలించిన వీఎంసీ కమిషనర్

  • రోడ్ నిర్మాణ పనుల నాణ్యత పరిశీలన, మిగిలిన పనులు సత్వరమే పూర్తి చేయాలి: కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ క్షేత్ర స్థాయిలో అధికారులతో కలసి సర్కిల్ -3 పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల నాణ్యత మరియు పనుల పురోగతిని పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు. 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్, సాయిరామ్ కట్ పిసెస్ రోడ్, నీలవేణి రోడ్, వి.యం.రంగా రోడ్, శివ శంకర్ రోడ్డులలో నూతనంగా అభివృద్ధి పరచిన సి.సి. రోడ్లను రీబౌండ్ హ్యామర్ తో పనుల యొక్క నాణ్యతను మరియు రోడ్డు యొక్క లోతు పరిమాణం నిబంధన ప్రకారం ఉన్నది లేనిది స్వయంగా పరిశీలించారు. సదరు రోడ్ల యందు జరుగుతున్న డ్రెయిన్ పనుల పురోగతిని పర్యవేక్షించి నిర్మాణ పనులు వేగవంతము చేసి సత్వరమే పూర్తి చేయుటతో పాటుగా డ్రెయిన్ నుండి డ్రెయిన్ రోడ్ మద్యన ఇంటర్ లాకింగ్ టైల్స్ ఏర్పాటు చేయునట్లుగా చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు.

అదే విధంగా నేతాజీ వంతెన రోడ్ (వెటర్నరీ హాస్పిటల్) మరియు మధుచౌక్ నందు చేపట్టి అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు. పిన్నమనేని పాల్లిక్లినిక్ రోడ్ మదర్ దేరిస్సా జంక్షన్ నందలి  హాకర్స్ వల్ల వాహనముల మరియు ప్రజల రాకపోకలకు అవరోధం కలుగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

పర్యటనలో ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్ చంద్ర శేఖర్, అసిస్టెంట్ ఇంజనీర్ మరియు ఇతర అధికారులతో పాటుగా సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.  
VMC

More Press News