రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శిగా సూర్య ప్రకాష్
ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ లో గవర్నర్ వారి సంయిక్త కార్యదర్శిగా పిఎస్ సూర్య ప్రకాష్ రావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. 2007 గ్రూప్ వన్ బ్యాచ్ కు చెందిన ఈయన ఇప్పటి వరకు కృష్ణా జిల్లా పరిషత్తు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా విధులు నిర్వహించి బదిలీపై రాజ్ భవన్ కు వచ్చారు. గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్సి ఆర్ పి సిసోడియాను కలిసిన అనంతరం, ఇప్పటి వరకు సంయిక్త కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలలో ఉన్న ఉప కార్యదర్శి సన్యాసి రావు నుండి చార్జి తీసుకున్నారు. ఖజానా, గణాంక శాఖ లో సంయిక్త సంచాలకులుగా ఉన్న సూర్య ప్రకాష్ గతంలో గుంటూరు జిల్లా పరిషత్తు సిఇఓగా, ముఖ్యమంత్రి కార్యదర్శి, దేవాదాయ శాఖ మంత్రికి వ్యక్తిగత కార్యదర్శిగా సమర్ధవంతంగా పనిచేసారు. తూర్పు గోదావరి జిల్లా ఖజానా శాఖలో ఉప సంచాలకులుగా, కర్నూలు అబ్కారీ శాఖలోనూ విధులు నిర్వర్తించారు. సంయిక్త కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సూర్య ప్రకాష్ ను రాజ్ భవన్ అధికారులు, ఉద్యోగులు కలిసి అభినందనలు తెలిపారు.
జారీ చేసిన వారు : గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కార్యాలయం, రాజ్ భవన్ , విజయవాడ
జారీ చేసిన వారు : గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కార్యాలయం, రాజ్ భవన్ , విజయవాడ