లబ్దిదారులకు సత్వరమే రుణాల మంజూరుకు చర్యలు చేపట్టాలి: విజయవాడ మేయర్
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ బ్యాంక్ ప్రతినిధులతో శుక్రవారం కౌన్సిల్ హాల్ నందు నిర్వహించిన సమావేశంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పాల్గొని బ్యాంకర్లకు తగు సూచనలు చేసారు. సదరు సమావేశంలో ప్రధానంగా టిడ్కో బుణాలు, పేదలందరికి ఇళ్ళు, జగనన్న తోడు, పి.యం స్వనిది అంశాలపై బ్యాంకర్స్ తో సమీక్షించి, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకములలో అర్హులైన లబ్దిదారులకు రుణాలు మంజూరు చేయు విషయంలో బ్యాంకర్స్ ముందుకు రావాలని అన్నారు. లబ్దిదారుల యొక్క జీవన విధానములను దృష్టిలో ఉంచుకొని వారికీ అవసరమైన రుణాలు కల్పించవలసిన అవసరం ఎంతో ఉందని తెలియజేస్తూ, సత్వరమే రుణాలు మంజూరు చేయునట్లుగా బ్యాంకర్స్ చొరవ చూపాలని అన్నారు.
టిడ్కో హౌసింగ్ రుణాల అర్జీలను బ్యాంకులకు పంపించిన దర్మిలా వాటిని పరిశీలించి లబ్దిదారులకు వెనువెంటనే లబ్దిదారులకు రుణాలు మంజూరు చేయునట్లుగా చర్యలు తీసుకోవాలని సూచించారు. హౌసింగ్ లోన్ మంజూరు కాబడిన స్వయం సహాయక సంఘాల మహిళకు ప్రభుత్వం వారి మార్గదర్శలకు అనుగుణంగా రూ.35,000/- ఋణo ఇవ్వవలసినదిగా కోరినారు. అదే విధంగా జగనన్న తోడులో బ్యాంక్ ద్వారా ఋణ సౌకర్యం పొందుటకు ఎంపిక కాబడిన లబ్దిదారులకు రూ.10,000/- ఋణము జమ చేయాలని అన్నారు. దీనితో పాటుగా పి.యం స్వనిది 2వ విడతగా అర్హులైన లబ్దిదారులకు రూ.20,000/- మంజూరు చేయునట్లుగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్బంలో ఇప్పటి వరకు ఎంత మందికి రుణాల మంజూరు చేసినది, ఇంకను ఎంత మందికి మంజూరు చేయవలసియున్నది మొదలగు వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు.
అదే విధంగా యు.సి.డి క్షేత్ర స్థాయి సిబ్బంది కూడా లబ్దిదారులను చైతన్యవంతులను చేసి, బ్యాంక్ల వారితో ఎప్పటికప్పడు సమిక్షించుకొనుచూ అర్హులైన వారందరికి రుణాల అందించేలా కృషి చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కమిషనర్ (జనరల్) మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్ యు.సి.డి యం.శ్యామల, జాయింట్ డైరెక్టర్ (అమృత్ ) డా.కె.బి.ఎన్.ఎస్ లతా, టిడ్కో ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్ చిన్నోడు, డి.జి.యం, ఇండియన్ బ్యాంక్ డి.జి.యం మరియు వివిధ బ్యాంక్ ప్రతినిధులు మరియు యు.సి.డి సిబ్బంది పాల్గొన్నారు.
నగరంలో సింగల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేదాన్ని పాటించాలి: నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు జూలై 1వ తేది నుండి సింగల్ యూజ్ ప్లాస్టిక్ (75 మైక్రాన్ల ) కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ వాడకo నిషేదించాలని ఉత్తర్వులను ప్రజలు స్వచ్చందంగా పాటించాలని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలువునిచ్చారు.
నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ నందు యు.సి.డి క్షేత్ర స్థాయి సిబ్బందితో ప్లాస్టిక్ నిషేధం పై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్బంలో కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ వాడకం నిషేదము అమలు జరిగేలా క్షేత్ర స్థాయిలో మీరు స్వయం సహాయక సంఘాల మహిళలకు అవగాహన కల్పించవలసిన ఆవశ్యకత ఎంతో ఉందని అన్నారు. ఇందు ప్రధానంగా ప్లాస్టిక్ తో చేసిన ప్లేట్లు, గ్లాసులు, స్పూన్, కప్స్, స్ట్రాలు, స్వీట్ బాక్స్, ఫుడ్ ప్యాకింగ్ కవర్లు, ప్లాస్టిక్ జండాలు, ధర్మకోల్ వంటి నిషేదిత జాబితాలో ఉన్నవని, నిషేదాన్ని ప్రతి ఒక్కరు పాటించేలా చూడలని అన్నారు.
అదే విధంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్లాస్టిక్ నివారించుటలో ప్రతి ఒక్కరు సామజిక భాద్యతగా తీసుకోని విజయవాడ నగరం ప్లాస్టిక్ రహిత నగరం మరియు ఆరోగ్య నగరం అంటూ చేయి చేయి కలిపి ముందుకు సాగాలని అన్నారు. ప్లాస్టిక్ నివారించి పర్యావరణాన్ని కాపాడుకుందాం, ప్లాస్టిక్ బ్యాగ్లు నివారిస్తూ క్లాత్, జ్యూట్ బ్యాగ్లులను వినియోగించుకొని మనందరం కలసి సమిష్టిగా మన నగరాన్ని ప్లాస్టిక్ రహిత మరియు ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దుకొనుటలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తదుపరి సిబ్బందికి జ్యూట్ బ్యాగ్లు మరియు స్టీల్ గ్లాస్ లను అందించారు.
కార్యక్రమములో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, అదనపు కమిషనర్ (జనరల్) మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్ యు.సి.డి యం.శ్యామల, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.సి.హెచ్ బాబు శ్రీనివాసన్, జాయింట్ డైరెక్టర్ (అమృత్ ) డా.కె.బి.ఎన్.ఎస్ లతా, జోనల్ కమిషనర్లు మరియు యు.సి.డి సిబ్బంది పాల్గొన్నారు.