విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్
- సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ విద్యార్థులు మరోసారి విజయ కేతనం ఎగురేశారు
- పదవ తరగతి ఫలితాలలో స్టేట్ సరాసరి 90%కాగా,ఈ సొసైటీ విద్యార్థినీ విద్యార్థులు 98.14%
- ఉత్తీర్ణులయ్యారు
- 126 స్కూళ్ల విద్యార్థులు 100% పాసయ్యారు
- 287మంది విద్యార్థులు నూటికి నూరు శాతం (10/10 ) మార్కులు సాధించారు
- విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చడం పట్ల మంత్రి కొప్పుల ఈశ్వర్, సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్ లు సంతోషం వ్యక్తం చేశారు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు
వీరిలో 287మంది నూటికి నూరు శాతం ( 10/10) మార్కులు సాధించారు. పదవ తరగతిలో ఈ సొసైటీకి చెందిన 126 స్కూళ్లు 100% ఫలితాలు సాధించాయి. ఎస్సీ గురుకుల పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం పట్ల మంత్రి కొప్పుల ఈశ్వర్, సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్ లు సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అధికారులు, అధ్యాపకులు, సిబ్బందిని మంత్రి కొప్పుల ఈశ్వర్, కార్యదర్శి రోనాల్డ్ రాస్ లు అభినందిస్తూ, ఇదే విధంగా ముందుకు సాగుతూ సొసైటీ పేరు ప్రతిష్ఠలను మరింత ఇనుమడింప జేయాల్సిందిగా కోరారు.