పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ది - మౌలిక సదుపాయాల కల్పన
హైదరాబాద్, 25 జూన్ 2022: పట్టణికరణలో 46.8 శాతం జనాభా తో దేశంలో మూడవ స్థానంలో ఉన్న తెలంగాణలో పట్టణ ప్రగతి కార్యక్రమంతో మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. రాష్ట్రం ఏర్పడ్డాక మున్సిపాలిటీలు, కార్పోరేషన్ల సంఖ్య 142 కి పెంచింది. పట్టణ ప్రాంతాలలో ప్రజల జీవన స్థితి గతులను పెంచడానికి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతున్నది. రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలలో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి నిమిత్తం ప్రభుత్వం తెలంగాణ పట్టణ ఆర్దిక వనరులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ది కోర్పోరేషన్ లిమిటెడ్ (TUFIDC) ను 2014 న ఏర్పాటు చేసింది. పట్టణాలలొ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను TUFIDC చేపడుతున్నది.
రూ.3809 కోట్లతో TUFIDC కి అన్నీ పట్టణ స్థానిక సంస్థలలో మౌళిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులకు అనుమతి లభించింది. తదనుసారంగా ఇప్పటి వరకు 117 పట్టణ స్థానిక సంస్థలకు రూ. 3219 కోట్లు లాంచన ప్రాయంగా కేటాయించింది. తద్వారా చేపడుతున్న పనుల ద్వారా పట్టణ స్థానిక సంస్థలలోని పౌర జీవితంలో చెప్పుకొదగిన అభివృద్ది జరిగింది.
72.68 కోట్లతో సిద్దిపేట్ భూగర్బ డ్రెనేజి ప్రాజెక్టు 90 శాతం పూర్తి అయినాయి, రూ.75.76 కోట్లు సిరిసిల్ల త్రాగునీటి సరఫరా ప్రాజెక్టు, 160.05 కోట్లు నిజామాబాద్ మురుగునీటి సరఫరా, 81.41 కోట్లు సూర్యాపేట్ డ్రైనేజ్ పధకానికి 71 శాతం పూర్తయ్యింది. ఇవికాక పట్టణ స్థానిక సంస్థలలోని ఎఫ్ ఎస్ టిపిల ఏర్పాటు 50 కోట్లు, 4 పట్టణ అభివృద్ది అథారిటీలకు 40 కోట్లు, పూర్తయిన పనులకు 109.24 కోట్లు ఋణాలు మంజూరయ్యాయి.
అందుబాటులో ఉన్న నిధులను దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్యతల ప్రాతిపదికపై దశల వారీగా పనులు చేపట్టడం జరుగుచున్నది. TUFIDC ప్రధానంగా పట్టణ స్టానిక సంస్థలలో ముఖ్యమైన రోడ్లు, సెంట్రల్ లైటింగ్, ముఖ్యమైన కాలువలు, చెరువుల సుందరీకరణ, పార్కుల అభివృద్ధి పనులను చేవడుతున్నది. 2928 పనులకుగాను 690 కోట్ల విలువైన 930 పనులు పూర్తి అయ్యాయి. 862 కోట్ల విలువ గల 741 పనులు జరుగుచున్నాయి. 998 కోట్ల విలువైన 1257 పనులు టెండర్ దశలో ఉన్నాయి.
TUFIDC ఆధ్వర్యంలో జి.హెచ్.ఎం.సి. హైదరాబాద్, జి.డబ్ల్యు.ఎం.సి. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ రామగుండం, నిజామాబాద్, మహబూబ్ నగర్, మిర్యాలగూడ, సూర్యాపేట, నల్లగొండ, ఆదిలాబాద్, సిద్దిపేట్ తదితర -12 నగరాలు /పట్టణాలలో 2015-16 , 2016-17, 2017-20 సంవత్సరాలకు రూ 1616 కోట్ల ఔట్ లే తో రుపోందించిన రాష్ట్ర వార్షిక కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తున్నది. పది పట్టణ స్థానిక సంస్థలలో నీటి సరఫరా సంబంధించి రూ. 1441 కోట్లతో 27 పనులు ,2 పట్టణ స్థానిక సంస్థలలో మురుగు నీటి పారుదలకు సంబంధించి రూ.184 కోట్లతో 4 పనులు, 12 పట్టణ స్థానిక సంస్థలలో 40 కోట్లతో 35 పార్కు పనులు మొత్తం 1666 కోట్లతో 66 పనులు చేపట్టబడి 25 నీటి సరఫరా ప్రాజెక్ట్లు 4 మురుగు నీటి ప్రాజెక్ట్లు, 27 పార్క్ ప్రాజెక్ట్లు పూర్తి అయ్యాయి. 10 పట్టణ స్థానిక సంస్థలలో 2.40 లక్షల ఇండ్లకు నీటి సరఫరా కనెక్షన్లు ఇవ్వడం జరిగింది.2 పట్టణ స్థానిక సంస్థలలో 0.55 వేల భూగర్భ డ్రైనేజి కనెక్షన్లు ఇవ్వబడ్డాయి.
రాష్ట్రానికి చెందిన నగరాలలో జల సంరక్షణ యుఎల్ బి లలో గ్రిడ్ స్థలాల అభివృద్ధితో పాటు నీటి జలాశయాలకు పునర్జీవనం కల్పించి నగరాలను నీటి సంరక్షిత నగరాలుగా తీర్చిదిద్దే లక్ష్యం తో పనులు కూడా చేపడతారు. రాష్ట్రానికి చెందిన 12 నగరాలలో 100 శాతం మురుగునీటి పారుదల మరియు సెప్టెజ్ నిర్వహణ ఏర్పాటుకు లక్ష్యం గా రాష్ట్ర జల కార్యాచరణ ప్రణాళిక రూప కల్పన పురోగతిలో ఉంది.