తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు ప్రాధాన్యత
హైదరాబాద్ జూన్ 20: మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామీణ భారతం... గ్రామ స్వరాజ్యం... ఆశయాలను గడిచిన ఎనిమిది ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం సాకారం చేసింది. మన ముఖ్యమంత్రి స్వయంగా ఒక రైతు బిడ్డ... సిద్దిపేట ముద్దుబిడ్డ.... ఆయన ఆలోచనలు, ఆయన ప్రసంగాలు, ఎల్లప్పుడు రైతుల సంక్షేమం కోసం తపన పడుతుంటాయి.
ఈ దేశానికి రైతే రాజు... రారాజు.... అని పదే పదే చెబుతూ ఉంటారు మన ముఖ్యమంత్రి. రైతులే... గ్రామీణ కథానాయకులు, రాష్ట్ర అభివృద్ధి సాదకులు అని ఆయన తన ప్రసంగంలో, పలు సందర్భాల్లో పేర్కొంటారు.
రైతు లేనిదే సమసమాజం కలలు సాకారం చేయలేమని ఆయన పలు సమావేశాలలో ఉద్ఘాటిస్తుంటారు. ఆ దిశలో గడిచిన ఎనిమిది సంవత్సరాలలో వేల కోట్ల రూపాయల బడ్జెట్ ను రాష్ట్రంలో పశు సంపద అభివృద్ధి కొరకు కేటాయించారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమను అభివృద్ధి చేసిన ఘనత మన ముఖ్యమంత్రిదే అని చేప్పవచ్చు.
2013-14 ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రంలో గొర్రెల పెంపకం, గేదెల పెంపకం, పాడి పరిశ్రమ నామ మాత్రంగానే ఉండేది. 2013 సంవత్సరంలో రూ.24,878 కోట్ల విలువగల పశు సంపద ఉండగా, 2021-22 సంవత్సరము నాటికి రూ.94,400 కోట్ల పశు విలువగల సంపద గణనీయంగా పెరిగింది. 79.45 శాతం అభివృద్ధితో రూ.69,522 కోట్ల సంపదకు గడిచిన 8 సంవత్సరాలలో పశు సంపద పెరిగింది, రాష్ట్ర అభివృద్దిలో, స్థూల ఆదాయంలో పాడి సంపద, కీలక పాత్ర పోషించింది.
అదే విధంగా గొర్రెల పెంపకం విషయానికి వస్తే, రాష్ట్రంలో పశు సంపద లెక్కల ప్రకారం 2012 సంవత్సరములో ఒక కోటి 28 లక్షల గొర్రెల పెంపకం ఉండగా, 2019 సంవత్సరంలో ఒక కోటి 91 లక్షల కు పెరిగింది. ఇందులో 49.21 శాతం వృద్ధితో 63 లక్షల గొర్రెలను అభివృద్ధి చేయడంతో రాష్ట్ర పశు సంపద గణనీయంగా పెరిగింది.
2022 ఫిబ్రవరి నాటికి గొర్రెల పంపిణీ 3.88 లక్షల యూనిట్లల్లో 81 లక్షల 60 వేల గొర్రెలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 2013-14 ఆర్ధిక సంవత్సరంలో 2,012 గొర్రెల పెంపకం సొసైటీలు ఉండగా, 2020-21 నాటికి ఆ సొసైటీల సంఖ్య 8,392 కు పెరిగింది. అంటే 6,380 సొసైటీలను ప్రభుత్వం అదనంగా ఏర్పాటు చేసి 417 శాతం వృద్దితో గొర్రెల అభివృద్ధి చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదే అని చేప్పవచ్చు. ఆ సొసైటీల సభ్యుల సంఖ్య ఆనాడు ఒక లక్ష 30 వేల మంది ఉండగా , 2020-21 నాటికి 7 లక్షల 92 వేల 111 మంది సభ్యులుగా నమోదయ్యారు.
అదే విధంగా , పాడి పరిశ్రమ అభివృద్ధిని పరిశీలిస్తే, 2013-14 సంవత్సరంలో 42.07 లక్షల టన్నుల పాల ఉత్పత్తి ఉండగా, 2021-22 నాటికి 60.99 లక్షల టన్నుల ఉత్పత్తికి క్షీర సంపద పెరిగింది. 44.97 శాతం వృద్ధితో 18.92 లక్షల టన్నుల పాల ఉత్పత్తిని మన ప్రభుత్వం పెంచింది. 2021-22 (మూడవ క్వార్టర్) నాటికి 46.81 లక్షల టన్నుల ఉత్పత్తకి పెరిగింది. తెలంగాణ 2014-15 లో తెలంగాణ దినసరి పాల వినియోగం 296 గ్రాములుండగా, 2021-22 సంవత్సరంలో 370 గ్రాముల వినియోగానికి పెరిగింది. 25 శాతం వృద్ధితో 74 గ్రాముల వినియోగం పెరిగింది. రాష్ట్రంలో పాల ఉత్పత్తి గణనీయ స్థాయికి చేరుకుందని మన ముఖ్యమంత్రి పలు సమావేశాలలో పేర్కొంటారు.
తెలంగాణ రాష్ట్రంలో మాంసం ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది. 2013-14 లో 4.46 లక్షల టన్నుల మాంసం ఉత్పత్తి ఉండగా 2021-22 నాటికి 10.15 లక్షల టన్నుల ఉత్పత్తికి పెరిగింది. 2013-14 సంవత్సరంలో ప్రతి ఒక వ్యక్తి సగటున 12.95 kg మాంసం వినియోగించగా, 2021-22 లో 22.55 kg ల వినియోగానికి పెరిగింది.
అదే విధంగా రాష్ట్రంలో మత్స్య సంపద (చేపల పెంపకం) కూడా గణనీయంగా పెరిగింది. 2013-14 సంవత్సరంలో 2 కోట్ల 49 లక్షల 633 టన్నుల ఉత్పత్తి ఉండగా, 2021-22 సంవత్సరంలో 3,89,969 టన్నుల ఉత్పత్తికి పెరిగింది. 2013-14 సంవత్సరంలో చేపల పెంపకానికి రూ.2,479 కోట్ల వ్యయం కాగా, 2021-22 నాటికి అ వ్యయం రూ.5,859 కోట్లకు పెరిగింది.
2020-21 సంవత్సరంలో రూ.3,342 కోట్ల బడ్జెట్ తో చేపల పెంపకానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మన రాష్ట్రంలో గుడ్ల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది. 2013-14 సం.లో 1,006 కోట్ల గుడ్లు ఉత్పత్తి కాగా 2021-22 సం.లో 1,725 కోట్ల కు ఉత్పత్తి పెరిగింది. గుడ్ల వినియోగం కూడా రాష్ట్రంలో 2014-15 సం.లో సగటున 272 గుడ్ల వినియోగం ఉండగా, 2021-22 సం.లో 383 గుడ్లకు వినియోగం పెరిగింది.
ఈ విధంగా మన రాష్ట్రంలో పాడి సంపద, మత్స్య సంపద, పశు సంపద పెరిగి దేశంలో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన ఉన్నది. తెలంగాణ ప్రజలకు ఇది గర్వకారణం అని చేప్పవచ్చు.