గచ్చిబౌలిలోని టెక్నాలజీ హబ్ ను సందర్శించిన ఆసియాన్ జర్నలిస్టుల బృందం

ఆసియాన్ జర్నలిస్టుల బృందం ఆదివారం సాయంత్రం గచ్చిబౌలి లోని టెక్నాలజీ - హబ్ ను సందర్శించింది. హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆసియాన్ జర్నలిస్టుల బృందం ఆదివారం సాయంత్రం గచ్చిబౌలి లోని టెక్నాలజీ -హబ్ ను సందర్శించింది. స్టార్ట్ అప్స్ ల తీరు, టెక్నాలజీ ఇన్నోవేటివ్, వర్చువల్ సొల్యూషన్స్, మార్కెటింగ్, ఎకో సిస్టం, ప్రపంచ టెక్నాలజీ అభివృద్ధి సంస్థలతో కలిసి t-hub పనిచేస్తున్నట్లు పవర్ పాయింట్ presentation ద్వారా t-hub వైస్ ప్రెసిడెంట్ పన్నీర్ సెల్వం వివరించారు. T-hub ను అనేక రాష్ట్రాలు మోడల్ గా తీసుకుంటున్నాయి. T-hub అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపుతున్నది. త్వరలోనే ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్ గా రూపుదిద్దుకోనున్నది.T-hub లోని వివిధ ఇన్నోవేటివ్ విభాగాలు గురించి t-hub సీనియర్ బిజీనెస్ ప్రోగ్రాం మేనేజర్ ప్రియాంక వివరించారు.

More Press News