నాంప‌ల్లి ప‌బ్లిక్ గార్డెన్స్‌లో ఉచిత వైద్య‌శిబిరం నిర్వ‌హించిన సెంచురీ ఆస్ప‌త్రి

హైదరాబాద్, జూన్ 19, 2022: న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన సెంచురీ ఆస్ప‌త్రి నాంప‌ల్లి ప‌బ్లిక్ గార్డెన్స్‌లో అన్ని వ‌య‌సుల‌కు చెందిన వారి కోసం ఉచిత ఆరోగ్య‌, వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వ‌హించింది. సుమారు 200 మందికి ఇందులో పాల్గొని, ఉచితంగా వైద్య ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. దాంతోపాటు శిబిరంలో పాల్గొన్న వైద్యుల నుంచి స‌ల‌హాలు పొందారు. 

ఉద‌యం 6 గంట‌ల నుంచి 9 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించిన ఈ శిబిరంలో ర‌క్త‌పోటు, ర్యాండ‌మ్ బ్ల‌డ్ షుగ‌ర్‌, ఎత్తు, బ‌రువు, బాడీ మాస్ ఇండెక్స్ వంటి ప‌రీక్ష‌ల‌ల‌ను శిబిరానికి హాజ‌రైన పైగా ప్ర‌జ‌ల‌కు చేశారు. సెంచురీ ఆస్ప‌త్రికి చెందిన వైద్యులు శిబిరానికి వ‌చ్చి, ఈ ప‌రీక్ష‌ల ఫలితాల‌ను విశ్లేషించి, భ‌విష్య‌త్తులో ఏం చేయాలో వారికి తెలిపారు. ఇప్ప‌టికే ఉన్న‌, లేదా ఉన్నాయ‌ని భావిస్తున్న స‌మ‌స్య‌ల కోసం మ‌రిన్ని ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌నుకునేవారికి కొంత రాయితీని కూడా సెంచురీ ఆస్ప‌త్రి ప్ర‌క‌టించింది. 

ఈ సంద‌ర్భంగా సెంచురీ ఆస్ప‌త్రి సీఈవో డాక్ట‌ర్ హేమంత్ కౌకుంట్ల మాట్లాడుతూ, “ఆరోగ్యం కోసం న‌డ‌వ‌డం అనేది మ‌నిషి చేయ‌గ‌లిగిన అత్యంత మంచిప‌నుల్లో ఒక‌టి. మ‌రింత మంది ప్ర‌జ‌లు న‌డ‌వ‌డం, ఇత‌ర ఆరోగ్య‌క‌ర‌మైన అలవాట్లు చేసుకోవాల‌నే ఉద్దేశంతో ఈ శిబిరం నిర్వ‌హించాం. సెంచురీ ఆస్ప‌త్రి యాజ‌మాన్యం, వైద్యులు, సిబ్బంది అంతా ఈ ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని ప్రోత్స‌హిస్తున్నారు, ఆరోగ్య‌క‌ర‌మైన స‌మాజం కోసం పాటుప‌డే వారికి మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు” అని చెప్పారు.  ఈ శిబిరంలో ఇంకా సెంచురీ ఆస్ప‌త్రి డ్యూటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్ (డీఎంఓ) డాక్ట‌ర్ పాల్గుడి మ‌నోజ్‌కుమార్, వైద్య‌సిబ్బంది, న‌ర్సులు పాల్గొని ప్ర‌జ‌ల‌కు ప‌రీక్ష‌లు చేశారు. 


సెంచురీ ఆస్ప‌త్రి గురించి: హైద‌రాబాద్ న‌డిబొడ్డున 220 ప‌డ‌క‌ల‌తో అత్యాధునిక సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రిగా సెంచురీ ఆస్ప‌త్రి ఏర్పాటైంది. అగ్నిమాప‌క మార్గ‌ద‌ర్శ‌కాలు, ఎన్ఏబీహెచ్ ప్ర‌మాణాల ప్ర‌కారం నిర్మిత‌మైన ఏకైక ఆస్ప‌త్రి ఇదే. సెంచురీ ఆస్ప‌త్రి బృందంలో వైద్య‌నిపుణులు, న‌ర్సులు, ఫార్మ‌సిస్టులు, ఫిజియోథెర‌పిస్టులు, సోష‌ల్ వ‌ర్క‌ర్లు, వ‌లంటీర్ సేవ‌లు, స‌హాయ సిబ్బంది, వృద్ధుల చికిత్స నిపుణులు ఇలా ఎంద‌రో ఉన్నారు.

More Press News