పల్లె ప్రగతి ద్వారా మన గ్రామాలు దేశానికే ఆదర్శం: మంత్రి ఎర్రబెల్లి

  • 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయ్ పెట్ గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత తదితరులతో కలిసి పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
  • మొక్కలు నాటిన స్పీకర్, మంత్రులు
కామారెడ్డి: దేశాయ్ పెట్ గ్రామంలో వాడవాడలా స్పీకర్, మంత్రులు పర్యటించి పారిశుద్ధ్యం, వీధి దీపాలు, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. గ్రామంలో పారిశుద్ధ్యం నిర్వహణపై గ్రామ సర్పంచ్, కార్యదర్శి, సిబ్బందిని మంత్రి అభినందించారు. అనంతరం జరిగిన గ్రామ సభలో అంశాల వారీగా గ్రామ పరిస్థితులను మంత్రి సమీక్షించారు. గ్రామంలో ట్రాక్టర్ ఎన్ని గంటలకు వస్తున్నది? సమయానికి చెత్త సేకరణ సక్రమంగా జరుగుతున్నదా? డంపింగ్ యార్డు వినియోగిస్తున్నారా? చెత్త ను ఎరువుగా తయారు చేస్తున్నారా? ట్రాక్టర్, చెత్త ద్వారా ఎంత ఆదాయం వస్తున్నది? వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్:
  • పల్లె ప్రగతి ద్వారా మన గ్రామాలు దేశానికి ఆదర్శంగా తయారయ్యాయి
  • గ్రామాల్లో అన్ని సదుపాయాలు సమకురుతున్నాయి
  • ఒకప్పటి పట్టణ, నగర వలస తగ్గిపోయి, ఇప్పుడు పల్లెలకు వలస మొదలైంది
  • గ్రామాలు సర్వాంగ సుందరంగా తయారయ్యాయి
  • పారిశుద్ధ్యం పెరిగి, ఆరోగ్యం పెరిగి గ్రామాలు ఆయు ఆరోగ్యాలకు అడ్రెస్స్ గా మారాయి
  • ఒక గ్రామానికి పచ్చదనం పెంచడానికి నర్సరీలు, డంపింగ్ యార్డులు, చెత్తను వేరు చేసే పద్ధతి, అంతిమ సంస్కారాలకు వైకుంఠ ధామాలు వంటివి ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నాం
  • రైతు వేదికలు, కల్లా లు, రైతులకు ఎదురు పెట్టుబడి, రైతు బీమా, పెన్షన్లు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు.. ఇలా ఇన్ని సదుపాయాలు ఎప్పుడూ జరగలేదు. సీఎం కెసిఆర్ వల్లే ఇది సాధ్యమైంది
  • రోడ్లు, మురుగు నీటి కాలువలు వచ్చాయి
  • పైగా ట్రాక్టర్ల ద్వారా ఆదాయ మార్గాలు ఏర్పడ్డాయి
  • మొక్కలకు నీళ్ళు పోసే ట్రాక్టర్ ట్రిప్ కు 600 ఇస్తున్నాం
  • ట్రాక్టర్ ద్వారా 1 లక్షా 10 వేలు సంపాదించిన సర్పంచ్, కార్యదర్శిలకు అభినందనలు
  • కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు 1450 కోట్లు
  • ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన బకాయిలు నయా పైసా లేకుండా ఇచ్చేసినం
  • కేంద్ర నిధికి సమానంగా ప్రతి ఏటా 230 కోట్ల నిధులు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ
  • పేదల ఇంటికి మేనమామ గా కెసిఆర్ కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, కెసిఆర్ కిట్లు ఇస్తున్నాం
  • సొంత జాగాల్లో ఇండ్లు కట్టుకునే అవకాశం త్వరలోనే వస్తుంది
  • మీ ఎమ్మెల్యే, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మీ ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు
  • మీ ప్రాంతం నుంచి అనేక గ్రామాలు ఆదర్శ గ్రామాలు అయ్యాయి
  • పల్లె ప్రగతి కార్యక్రమం సాధించిన ఫలితాలు ఇక్కడి గల్లీల నుంచి ఢిల్లీని తాకాయి
  • ఇదంతా సీఎం కెసిఆర్ చొరవ, అధికారుల శ్రమ, ప్రజల భాగస్వామ్యం తోనే సాధ్యం అయింది
  • ఈ ప్రగతి కొనసాగాలని సీఎం కెసిఆర్ కోరుకుంటున్నారు
  • అందుకు తగ్గట్లు కావాల్సిన నిధులు ఇస్తున్నారు
  • ఈ నిధులన్నీ గ్రామాల అభివృద్ధికి ఆస్కారం ఏర్పడింది
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ దఫెదార్ శోభ, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, అధికారులు, సర్పంచ్ లు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, పెద్ద ఎత్తున మహిళలు దేశాయ్ పేట గ్రామ పల్లె ప్రగతిలో పాల్గొన్నారు.

More Press News