అభివృద్ధియే లక్ష్యంగా సెంట్రల్ నియోజకవర్గoలో రూ.7 కోట్ల అభివృద్ధి పనులకు శంఖుస్థాపన-ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన రెడ్డి

అభివృద్ధియే లక్ష్యంగా సెంట్రల్ నియోజకవర్గoలో రూ.7 కోట్ల అభివృద్ధి పనులకు శంఖుస్థాపన

అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తున్న ముఖ్యమంత్రి గౌ.శ్రీ వై.యస్.జగన్ మోహన రెడ్డి

రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖామాత్యులు మరియు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రివర్యులు శ్రీమతి తానేటి వనిత.

 
            సెంట్రల్ నియోజకవర్గo పరిధిలోని పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖామాత్యులు మరియు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రివర్యులు శ్రీమతి తానేటి వనిత,  శాసన సభ్యులు శ్రీ మల్లాది విష్ణు, నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి, శాసన మండలి సభ్యులు శ్రీ యం.డి రహుల్లా, డిప్యూటీ మేయర్లు శ్రీమతి బెల్లం దుర్గ,  శ్రీమతి అవుతు శ్రీ శైలజ మరియు ఆయా డివిజన్ల కార్పోరేటర్లతో కలసి శంకుస్థాపన చేసినారు.

ఈ సందర్భంలో మంత్రివర్యులు శ్రీమతి తానేటి వనిత మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా రాష్ట్రాన్ని అభివృద్ధిపరచాలనే గౌరవ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ గారి సారధ్యంలో అనేక కోట్ల రూపాయల అభివృద్ధి జరుగుతుందని అన్నారు. గత మూడు సంవత్సర కాలంలో సెంట్రల్ నియోజక వర్గంలో సుమారు 150 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టి వాటిని నిర్దేశిత గడువులోపుగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం జరిగిందని అన్నారు. అదే విధంగా 15వ ఆర్ధిక సంఘం – ఎయిర్ పొల్యూషన్ గ్రాంటు క్రింద మంజూరు కాబడిన రూ.7.00 కోట్ల నిధులను ఉపయోగించి రోడ్లు అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపన చేయటం జరిగిందని అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచుకొనుట  అధికారులను సమన్వయం చేసికొని ముందుకు వెళుతున్న ప్రజాప్రతినిధులను అభినందించారు.
అదే విధంగా నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించుటలో  నగరపాలక సంస్థ అనేక కోట్ల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమములకు శంకుస్థాపన చేయుట జరిగిందని, పనులు సత్వరమే చేపట్టి వాటిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం జరుగుతుందని అన్నారు. స్థానిక శాసన సభ్యులు శ్రీ మల్లాది విష్ణు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గo పరిధిలోని ఎన్నడు లేని అభివృద్ధి పనులు మా ప్రభుత్వం చేపట్టినట్లు సుదీర్ఘ కాలం కచ్చా రోడ్లతో కొత్తగా అభివృద్ధి చెందుతున్న అనేక కాలనీలు సైతం నేడు అభివృద్ధి పరచే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతుందని అన్నారు. జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి గారు నిరంతరo నియోజక వర్గంలో అభివృద్ధిని పర్యవేక్షిస్తూ, ముందుకు తీసుకువెళ్లటం అభినందనీయమని అన్నారు.  పార్టీలకు అతీతంగా అన్ని ప్రాంతాలు అభివృద్ది చేయాలన్నదే మా ప్రభుత్వం ఉద్దేశం, అని పేర్కొన్నారు.

ముందుగా రూ. 175 లక్షల 15వ ఆర్ధిక సంఘ నిధులతో 30 వ డివిజన్  వినాయక నగర్ నందలి అంతర్గత రోడ్లను బి.టి హాట్ మిక్స్ పద్ధతిలో రోడ్ నిర్మాణ పనులకు, రూ.100 లక్షల అంచనాలతో జీవిఆర్ నగర్ మరియు దావు బుచయ్య కాలనీ లోని బి.టి హాట్ మిక్స్ రోడ్ పనులకు శంఖుస్థాపన గావించారు.  అదే విధంగా రూ.180 లక్షల వ్యయంతో 58 వ డివిజన్  భారత్ మాతా అంతర్గత రోడ్లకు మరియు 63వ డివిజన్ నందలి పైపుల రోడ్ జంక్షన్ నుండి ఉడా కాలనీ (హోసన్నా మందిర్ రోడ్) నందు రూ. 125 లక్షలతో ,  రూ. 120 లక్షల నిధులతో డాక్టర్ కాలనీ అంతర్గత రోడ్లు బి.టి హాట్ మిక్స్ రోడ్లగా అభివృద్ధికి శంకుస్థాపన చేసారు. వీటితో పాటుగా   రూ. 14.17 లక్షల నగరపాలక సంస్థ సాదారణ నిధులతో 57వ డివిజన్ నందలి 4 క్రాస్ రోడ్లలో హైమస్ట్ లైట్ల మరియు రూ.4.60 లక్షల ముత్యాలంపాడు గవర్నర్ మెంట్ ప్రెస్ నందు హైమస్ట్ లైట్ ఏర్పాటులను ప్రారభించారు.  
కార్యక్రమములో పలువురు కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్ వి.శ్రీనివాస్ మరియు ఇతర అధికారులు సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

పబ్లిక్ రిలేషన్ అధికారి



More Press News