ప్రెస్ నోట్- పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు

పత్రికా ప్రకటన 05.06.2022

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందు కోసమే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యా దవ్ తెలిపారు. ఆదివారం అంబర్ పేట నియోజకవర్గ పరిధిలోని గోల్నాక
డివిజన్ లో MLA కాలేరు వెంకటేష్ తో కలిసి, ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని గాంధీనగర్ డివిజన్ లో MLA ముఠా గోపాల్ తో కలిసి ప్రగతి
కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ పాల్గొన్నారు.  అంబర్ పేట నియోజకవర్గ పరిధిలో.. గోల్నాక డివిజన్ పరిధిలోని  కృష్ణా నగర్ లో మొక్కలను నాటిన అనంతరం స్థానికంగా గల నాలాలో పూడిక తొలగించే పనులను  పరిశీలించారు. నాలా వెంట ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారు. బస్తీలో  డ్రైనేజీ పైప్ లైన్, CC రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెలు, పట్టణాలలోని సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశం తో ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం గా సాగుతున్నాయని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే పృతిపక్ష నేతలు అర్థంపర్థం లేని విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నుండి ఒక్క పైసా తీసుకురావడం చేతకాదని, ఓటేసి గెలిపించిన ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిజాం కాలంలో నిర్మించిన నాలాలను అభివృద్ధి చేయాలని గతంలో ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా ? అని మంత్రి ప్రశ్నించారు. మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు చొరవతో SNDP కార్యక్రమం క్రింద నగరంలోని నాలాల లోAపూడిక తొలగింపు, అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని వివరించారు. ఎన్నో సంవత్సరాల నుండి నాలా పరిసర ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న వరద ముంపు సమస్య శాశ్వతంగా కానున్నదని చెప్పారు. మంత్రి జోనల్ కమిషనర్శ్రీ నివాస్ రెడ్డి, వాటర్ వర్క్స్, హార్టికల్చర్ తదితర శాఖల అధికారులు ఉన్నారు.

ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలో..

ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని గాంధీ నగర్ డివిజన్ లోగల అరుంధతి నగర్లో  పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక నాలాను పరిశీలించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.తమ బస్తీలో CC రోడ్లు నిర్మించాలని కోరగా, త్వరలోనే చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. నాలా వెంట ఉన్న ఖాళీ స్థలంలో కమ్యూనిటీ హాల్ని ర్మించాలని కోరగా, స్థలం వివాదం కోర్టులో ఉన్నదని, సమస్యను
పరిష్కరించి అభివృద్ధి నిర్మాణ పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు
సంతోషంగా ఉండాలనేది ముఖ్యమంత్రి ఆశయం అన్నారు. దానిని దృష్టిలో ఉంచుకొని అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు
తెలిపారు. సమాజంలో అభివృద్ధి లో ఎంతో వెనుకబడిన దళితుల అభ్యున్నతి కోసమే దళిత బంధు కార్యక్రమం ప్రారంభించినట్లు వివరించారు. అంతేకాకుండా పేద, మధ్య తరగతి కుటుంబాలు తమ పిల్లలను వేలాది రూపాయలు వెచ్చించి ప్రయివేట్ పాఠశాలల్లో చేర్పించలేకపోతున్నట్లు చెప్పారు. వారికి నాణ్యమైన విద్యను ఉచితంగా అందించాలనే సంకల్పంతో  ప్రభుత్వ పాఠశాలలను మన బస్తీ మన బడి కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు, వసతులు కల్పిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంతో తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు.


More Press News