కుంభ్ సందేశ్ యాత్రకు జాతీయ పురస్కారం
* కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న జీకాట్ వ్యవస్థాపకులు ఢిల్లీ వసంత్
హైదరాబాద్, జూన్ 5, 2022: కరోనా అనంతర ప్రపంచానికి భారతీయ సాంస్కృతిక పునాదులపై జాతీయ స్థాయిలో గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ (జీకాట్) సంస్థ గత సంవత్సరం చేపట్టిన 7 వేల కిలోమీటర్ల కుంభ్ సందేశ్ యాత్రకు జాతీయ స్థాయి పురస్కారం దక్కింది. మహారాష్ట్రలోని కుతాత్మ డిజేబుల్డ్ మల్టీపర్పస్ డెవలప్‌మెంట్ అండ్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, స్వామి సమర్థ మందిర్ ట్రస్టు సంయుక్తంగా జాతీయ స్థాయిలో ప్రకటించిన రాష్ట్రీయ గోమంతక్ పురస్కారాలను జీకాట్ దక్కించుకుంది. కేంద్ర పర్యాటక, ఓడరేవులు, జలవనరుల శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశో నాయక్ చేతుల మీదుగా గోవాలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో జీకాట్ వ్యస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ ఢిల్లీ వసంత్ ఈ అవార్డు అందుకున్నారు.
గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ (జీకాట్) సంస్థను ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఉస్మానియా పూర్వ విద్యార్థుల తరఫున గ్రామాల స్వయంసమృద్ధి కోసం, ఆదర్శ గ్రామాలకు సంబంధించిన విషయాలపై జీకాట్ సంస్థను నెలకొల్పారు. మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాల్లో తీసుకున్న తీర్మానానికి అనుగుణంగా, ప్రపంచాన్ని కరోనా ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా చేసిన విధ్వంసం దృష్ట్యా విధానపరమైన మార్పుల కోసం యావత్ ప్రపంచం భారతదేశపు సాంస్కృతిక పునాదులు,ఆహారపు అలవాట్లను తెలుసుకోవాలని జీకాట్ సంస్థ కుంభ్ సందేశ్ యాత్రను చేపట్టింది. కుంభ్ సందేశ్ అంటే భారతదేశంలో ఆధ్యాత్మిక పరంగా, వివిధ కులమతాల పరంపరల్లో ఉన్న గురువులు, సాధువులు తమ అనుభవం, సాధనతో పొందిన జ్ఞానాన్ని ఈ కుంభమేళాలో పదిమందితో పంచుకుంటారు. అందువల్ల ఈ కుంభమేళాను ఒక నాలెడ్జ్ ఎక్స్చేంజి సిస్టంగా యావత్ ప్రపంచానికి అర్థమయ్యేలా ప్రజలకు అవగాహన కల్పిస్తూ, దేశంలో కుంభమేళా నిర్వహించే నాలుగు ప్రదేశాలను కలుపుతూ, హైదరాబాద్‌లో 2021లో అప్పటి ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవిత, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఛైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ చేతుల మీదుగా హైదరాబాద్‌లో కుంభసందేశ్ యాత్ర ప్రారంభమైంది. కన్యాకుమారిలో తమిళనాడు ఇన్‌ఛార్జిగా పనిచేసిన బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అక్కడ ప్రారంభమైన ఈ కుంభసందేశ్ యాత్ర కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాష్ట్రాల మీదుగా ఢిల్లీకి చేరుకున్నప్పుడు అప్పటి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ స్వాగతించారు. ఢిల్లీ నుంచి 250 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగింది. ఈ పాదయాత్రలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ యాత్ర హరిద్వార్‌లో ముగిసినప్పుడు కుంభసందేశ్ యాత్ర గురించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను దివ్యప్రేమ్ సమాజ్ మిషన్ (డీపీఎస్ఎం) నిర్వహించగా, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ హాజరయ్యారు.
తెలుగు ప్రజలుగా, భారతీయ పునాదులను, సాంస్కృతిక విలువలను, ఆధ్యాత్మిక పరంపరను, శాస్త్రీయ, మౌలిక అంశాలపై 7 వేల కిలోమీటర్ల మేర యాత్ర నిర్వహించిన జీకాట్ సంస్థ మిషన్ 5151 అనే లక్ష్యంతో, అంటే భారతదేశ శతాబ్ది స్వాతంత్య్ర ఉత్సవాలు .. అంటే 2047 నాటికి.. అంటే భారతీయ కాలగమనం ప్రకారం 5151 అనే లక్ష్యంతో ఎన్ఏఈబీ.. అంటే నేషనల్ ఎఫారెస్టేషన్ అండ్ ఎకాలజీ బోర్డ్ సభ్యుడు మంకెన శ్రీనివాసరెడ్డి దీనికి ఛైర్మన్‌గా వ్యవహరించి, దీన్ని దిగ్విజయంగా ముగించారు. ఈ కుంభసందేశ్ యాత్రకు జాతీయ స్థాయిలో దక్కిన గౌరవాన్ని తెలుగు ప్రజలకు దక్కిన గౌరవంగా తెలుగు ప్రజలకు అంకితం చేస్తున్నామని జీకాట్ ఫౌండర్, మిషన్ 5151 సభ్యుడైన ఢిల్లీ వసంత్ చెప్పారు.
కరోనా అనంతర ప్రపంచానికి భారతదేశం ఒక గ్లోబల్ పార్లమెంటుగా పనిచేయాలనే లక్ష్యంతో సాగిన ఈ కుంభసందేశ్ యాత్రలో భారతీయ జీవనవిధానంలోని దినచర్య, రుతుచర్య అంశాలను శాస్త్రీయమైన అధ్యయనం ద్వారా పంచాంగ సంస్కరణలు చేపట్టాలనే లక్ష్యాన్ని జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు.
అంతేకాకుండా, గ్రామాల అధ్యయనం కోసం విలేజ్ మోనోగ్రాఫ్ ప్రారంభించిన జీకాట్.. ఇందుకోసం ఒక టెక్నాలజీ ప్లాట్‌ఫాం అభివృద్ధి చేయాలనే లక్ష్యం, కులవృత్తులలో ఉన్న శాస్త్రీయపరమైన అంశాలను ఆధునిక అసరాలకు తగినట్లుగా పునర్లిఖించాలనే లక్ష్యం కూడా ఈ మిషన్ 5151 ద్వారా తీసుకువచ్చారు. అంతేకాకుండా, హిమాలయాల్లో గతంలో ఉండి, ఇప్పుడు నశించిపోయిన దేవదారు వృక్షాలను కాపాడుకోడానికి ప్రత్యేక చొరవ చూపించాలని , ఇప్పుడున్న వేరే వృక్షజాతుల స్థానంలో సేంద్రియ పద్ధతిలో దేవదారు వృక్షాలను కాపాడుకోవాలనే లక్ష్యంతో మిషన్ 5151 ద్వారా హరిద్వార్ డిక్లరేషన్‌ను వారు ప్రకటించారు.