తెలంగాణ రాష్ట్రమంతా పండుగలా పల్లె ప్రగతి!

  • గ్రామాల్లో అభివృద్ధి జాతరలు!!
  • వెల్లువలా కదిలిన పల్లె జనాలు
  • పల్లెల్లో ప్రజలు, ప్రజా ప్రతినిధుల అభివృద్ధి, సంక్షేమ పాద యాత్రలు
  • పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు 
  • స్థానిక సంస్థలకు 9560.32 కోట్ల నిధులు విడుదల
  • ప్రతినెలా క్రమం తప్పకుండా పంచాయతీలకు నిధులు
  • తాజాగా 166 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
హైద‌రాబాద్: నాలుగు విడతలుగా పల్లె ప్రగతి సాధించిన అద్భుత విజయాలు నేపథ్యంలో ఈ నెల 3వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పల్లె ప్రగతి ఐదో విడత కార్యక్రమం పండుగల ప్రారంభమైంది. ప్రతి పల్లెలో ప్రజలు వెల్లువల వచ్చి అభివృద్ధి సంక్షేమ పాదయాత్రలు నిర్వహించారు. గ్రామ గ్రామాన అభివృద్ధి జాతరలు జరిగాయి. ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజలు అంతా కలిసి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరిపారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించారు. గత 4 విడతలుగా చేపట్టిన పల్లె ప్రగతి ప్రగతి నివేదికలు చదివారు. చేపట్టిన పనులు, వాటి పురోగతి, కొత్తగా చేపట్టాల్సిన పనుల పై చర్చించారు.

పల్లె ప్రగతి కార్యక్రమం కింద అ వేసిన నాలుగు గ్రామ కమిటీలు.. ప్రణాళిక కమిటీ, లైట్స్ కమిటీ, పారిశుద్ధ్య కమిటీ, గ్రీన్ కమిటీ లు గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించి, సమావేశమై గ్రామాల అభివృద్ధి పై ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. రోడ్లు మరియు మురుగునీటి కాలువలు ను పరిశుభ్ర పరిచారు. పల్లె ప్రగతి కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించి పారిశుద్ధ్య నిర్వహణపై చైతన్య పరిచారు. అనంతరం నిర్వహించిన గ్రామ సభల్లో గ్రామాభివృద్ధి పై తీర్మానాలు చేసుకుని ఆయా పనులు చేపట్టాలని నిర్ణయించుకున్నారు.

పల్లె ప్రగతి కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు వారి సొంత జిల్లాల్లో నియోజకవర్గాల్లో పాల్గొనగా ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో పల్లె ప్రగతి నిర్వహించారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, పరిస్థితుల చైర్మన్లు ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచులు ఎంపీటీసీలు వార్డు సభ్యులు ఇతర అనుబంధ సంఘాల సభ్యులు ఎన్జీవోలు అధికారులు ప్రజల భాగస్వామ్యంతో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మొదటిరోజు విజయవంతంగా నిర్వహించారు. మూడో తేదీ నుంచి ప‌క్షం రోజుల పాటు నిర్వహించాల్సిన రోజువారీ కార్యక్రమాలను అధికారులు గ్రామ సభల్లో ప్రజలకు వివరించారు.

రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రాయపర్తి లో, జనగామ జిల్లా కడవెండిలో పల్లె ప్రగతి లో పాల్గొన్నారు. అలాగే రాయపర్తి, కడవెండి గ్రామాల్లో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను మంత్రి ప్రారంభించారు.

రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, పల్లె ప్రగతి సాధించిన విజయాలతో పాటు, సాధించాల్సిన లక్ష్యాలను వివరించారు. జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు పాల్గొనాలని, కలెక్టర్ల అధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాలని, జిల్లా స్థాయి అధికారిని మండల పర్యవేక్షణ అధికారిగా నియమించాలని, ప్రతి గ్రామానికి ఒక మండల స్థాయి అధికారిని నియమించాలని, మండల స్థాయి మండల పంచాయతీ అధికారి పర్యవేక్షణ చేయాలని మంత్రి తెలిపారు.

సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. దేశంలో ఇలాంటి కార్యక్రమం లేదు. అందువల్లే మన పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. 20 గ్రామాలకు అవార్డులు ఇస్తే, అందులో 19 మనవే. అని చెప్పారు. ఒకప్పుడు గంగాదేవి పల్లె మాత్రమే దేశంలో ఆదర్శ గ్రామంగా ఉండేది. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గంగదేవి పల్లె గ్రామాన్ని మించి నేడు ఎన్నో గ్రామాలు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయి అని చెప్పారు. ఏడు ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్ర0 పరిస్థితి ఎట్లా ఉండే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ని ప్రజలు గమనించాలి. విశ్లేషించుకోవాలి. పల్లె ప్రగతి వల్ల గ్రామాలు గత వైభవాన్ని సంతరించుకుంటున్నాయి.

ఆధునికత తో పాటు, అన్ని సదుపాయాలు కలిగి, సమగ్రంగా సర్వతో ముఖాభివృద్ధి సాధిస్తున్నాయి. ఇది దేశంలోనే గ్రామాలకు స్వర్ణ యుగం. ఆనాడు గాంధీ కలలు కంటే, ఈనాడు వాటిని నిజం చేస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్ కే దక్కిందని మంత్రి వివరించారు. రాష్ట్ర ప్రజల  క్షేమం కోసం ఆనాడు ఎన్టీఆర్.. ఈనాడు కేసీఆర్ గారు ఆలోచిస్తున్నారు. ఒకవైపు అభివృద్ధి, మరో వైపు సంక్షేమం జోడెద్దుల్లా రాష్ట్ర ప్రగతి బండి సజావుగా ప్రయాణం సాగిస్తున్నది. ఇది చరిత్రలో చెరగని ముద్ర అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.

పెన్షన్ పెంపుతో  నేడు ఎంతో  మంది కి ఆర్ధిక  చేయూత  అందింది. కరోనా సమయంలో ఆర్ధిక పరిస్థితి బాగానే లేకున్నా సంక్షేమాన్ని ఆపలేదు. అభివృద్ధిని వీడలేదు అన్నారు. 65 ఏండ్ల నుండి 57 ఏళ్లకు వయోపరిమితి ని కుదించిన పెన్షన్ల ప్రక్రియ తుది దశకు చేరింది. త్వరలోనే రాష్ట్రంలో 8 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు. గత  ప్రభుత్వాలలో పనులు  జరగలేదు. అభివృద్ధి కుంటు పడింది కాబట్టే ఇవ్వాళ  పల్లె ప్రగతి అవసరం అయింది. పల్లె ప్రగతి ద్వారాఎన్నో అభివృద్ధి పనులను  చేపట్టామ‌ని చెప్పారు. స్థానిక సంస్థలకు 9560.32 కోట్ల నిధులు విడుదల - ప్రతినెలా క్రమం తప్పకుండా గ్రామీణ స్థానిక సంస్థ‌లో నిధులు

గ్రామీణ స్థానిక సంస్థ‌లో అంటే గ్రామపంచాయతీలు, మండల ప్రజా పరిషత్‌లు, జిల్లా ప్రజా పరిషత్‌లకు ప్రతినెలా ప్రత్యేక నిధులు విడుదల చేస్తున్నాము. 15వ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ కు సమాన గ్రాంట్ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ నుండి ఎటువంటి విరామం లేకుండా నిరంతరం విడుదల చేయబడుతోంది. ఇప్పటి వరకు రూ. సెప్టెంబర్-2019 నుంచి స్థానిక సంస్థలకు 9560.32 కోట్ల నిధులు విడుదలయ్యాయి. మే -2022 నెల పల్లె ప్రగతి మొత్తం కూడా విడుదలైంది. అంటే, గ్రామపంచాయతీలు, మండల ప్రజా పరిషత్‌లు, జిల్లా ప్రజా పరిషత్‌లకు రూ.256.66 కోట్లు. విడుదల అయ్యాయి.

గ్రామపంచాయతీ / మండల ప్రజా పరిషత్ / జిల్లా ప్రజా పరిషత్ యొక్క పెండింగ్‌లో ఉన్న టోకెన్/బిల్లులు మరియు చెక్కులు కూడా మే 28 నాటికి క్లియర్ చేయబడ్డాయి, రూ. పెండింగ్‌లో ఉన్న 474 కోట్లు రాబోయే రోజుల్లో టోకెన్/బిల్లులు/చెక్కులు క్లియర్ చేయబడతాయి. గ్రామపంచాయతీల ద్వారా మొదటి సారిగా EGS కింద పెద్ద మొత్తంలో రూ.1200 కోట్ల విలువైన CC రోడ్లు మంజూరు చేయబడ్డాయి. సర్పంచ్‌లు లేదా ఇతర ప్రజా ప్రతినిధుల ద్వారా అమలు చేయబడ్డాయి. అని మంత్రి వివరించారు. నిధులు క్లియరెన్స్ లో సాఫ్ట్‌ వేర్ సమస్య వచ్చిందని కేంద్రం అంటున్నది. అది క్లియర్ కాగానే పెండింగ్ బిల్లులు కూడా క్లియర్ అవుతాయి అని మంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటీవల విడుదలైన మొత్తం గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.166 కోట్లు విడుదల అయ్యాయి. తదుపరి మొత్తం కూడా త్వరలో అందిస్తామని మంత్రి చెప్పారు.

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ సందీప్  కుమార్ సుల్తానియా మాట్లాడుతూ, గ్రామాలలో రోడ్లు బాగుండాలి. పరిశుభ్రత ఉండాలి. ఇలా ప్రతీ ఒక్కరికి తమ గ్రామ అభివృద్ధి గురించి కోరికలు ఉంటాయి.. వాటిని అర్ధం చేసుకున్న మన ముఖ్యమంత్రి గారు పల్లె ప్రగతి కార్యక్రమన్ని రూపొందించారు.ప్రతీ నెల గ్రామ పంచాయతీ లకి నిధులు ఇస్తున్నాం. ఏ ఒక్క పనికి సంబందించిన బిల్ పెండింగ్ లో ఉండటం లేదు. 1,000 కోట్ల నిధులను గత మూడు నెలలో సీసీ రోడ్ లకు ప్రభుత్వం విడుదల చేసింది. పల్లె ప్రగతి ద్వారా ప్రతీ సంవత్సరం సరికొత్త  అభివృద్ధి పనులను  చేపడుతున్నాం. వైకుంఠ దామాలు, డంపింగ్ యార్డ్, ట్రాక్టర్ కొనుగులు, పల్లె ప్రకృతి వనాలు, మొక్కలను  నాటడం తదితర వన్నీ నిదర్శనాలు. డెంగ్యూ, మలేరియా  తదితర ఎన్నో వ్యాధులు పల్లె ప్రగతి కార్యక్రమలా ద్వారా చేపట్టిన పనుల వల్ల అరికట్టాం. బంగారు తెలంగాణతో పాటు ఆరోగ్య  తెలంగాణ సాధననే మన ముఖ్యమంత్రి లక్ష్యం అని వివరించారు.

పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ శరత్ మాట్లాడుతూ, గ్రామాలలో పల్లె ప్రగతి ముందు ఉన్న పరిస్థితి ని.. ఇప్పుడు ఉన్న పరిస్థితి కి చాలా తేడా ఉంది. గ్రామాల రూపురేఖలే మారాయి. పల్లె ప్రకృతిలో భాగంగా ప్రతీ గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టాం.ప్రతీ గ్రామంలో ట్రాక్టర్ కొనుగోలు చేసాం అన్నారు. 

More Press News