అందుబాటులోకీ ఆధునిక వైద్యం: మంత్రి జగదీష్ రెడ్డి
- గుండెపోటు సంభవిస్తే తక్షణ వైద్యం
- జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యంత ఖరీదైన ఇంజక్షన్లు
- రక్తప్రసరణ ఆగిపోయిన వారికి గంటలోపు వస్తే ప్రసరణ పునరుద్ధరణ
- ఇప్పటివరకు ప్రయోజనం పొందిన 15 మంది గుండెపోటు రోగులు
- 24 గంటలు అందుబాటులో
- విజయవంతంగా స్పెషల్ న్యూ బర్న్ కేర్ యూనిట్
- 100 రోజులుగా నిరంతర సేవలు
- హిమోఫిలియాకు వైద్యం
- అందుబాటులోకి ఖరీదైన మందులు
- ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం
- మంత్రి జగదీష్ రెడ్డి చొరవతో ఇంతటి అభివృద్ధి
- కొనియాడిన వైద్య బృందం
శనివారం ఉదయం రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొత్తగా మంజూరు అయినతెలంగాణా డయాగ్నిస్టిక్ హబ్ కు అవసరమైన స్థల పరిశీలన నిర్వహించారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల సూపరెండేంట్ దండా మురళీధర్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ శారద లతో పాటు అదే కళాశాలలో పని చేస్తున్న వైద్య విభాగదిపతులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.
గైనకాలజీ విభాగదిపతి డాక్టర్ సుజాత, పిల్లల వైద్య విభాగదిపతి డాక్టర్ శ్రీకాంత్ భట్, అర్ధోపేటిక్ విభాగం నుండి డాక్టర్ వి.శ్రీనివాస్, చర్మ వ్యాధుల విభాగం నుండి డాక్టర్ భూమేష్, అప్త్మలాజి నుండి డాక్టర్ రాంమోహన్ లాల్, ఏనస్తిషియా నుండి డాక్టర్ గీత, ఈ యన్ టి నుండి డాక్టర్ అరుణకుమారి ఇతర వైద్య సిబ్బంది ఈ సమీక్షలో పాల్గొన్నారు. మెడికల్ కళాశాల ప్రారంభం అనంతరం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పెరిగిన వైద్య సేవలు ప్రస్తావన వచ్చినప్పుడు మంత్రి జగదీష్ రెడ్డి ఎప్పటికప్పుడు తాను అప్డేట్ అవుతూ మమ్ముల్ని వెన్నంటి ప్రోత్సహిస్తూ సలహాలు సూచనలు ఇస్తున్నందునే వైద్య రంగంలోసూర్యాపేట ముందెన్నడూ లేని పురోగతి సాదించిందన్నారు. పొరుగు ప్రాంతాలకు మాత్రమే పరిమితము కాకుండా ఇక్కడి సేవలు పొరుగు రాష్ట్రాలకు వ్యాప్తి చెందయాని వైద్య విభాగాదిపతులు పేర్కొన్నారు.
అన్నింటికీ మించి సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆధునిక వైద్యం అందుబాటులోకి రావడం అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర మంత్రి జగదీష్ రెడ్డికి ఉన్న చలువ మాత్రమేనని ఆయన ఆశీర్వాదం ప్రస్తుతం ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని వారు స్పష్టం చేశారు.
అన్నింటికీ మించి ప్రస్తుతం సూర్యపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గుండెపోటుకు అత్యంత ఖరీదైన మందులు అందుబాటులోకి రావడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోందన్నారు. గుండె కింది భాగంలో ఉన్న నాలుగు నాలాళలో రక్తం గడ్డ కట్టిపోయి గుండెపోటు సంభవించిన రోగిని గంటలోపు ఆసుపత్రికి తరలించ గలిగితే రక్తప్రసరణ పునరుద్ధరణకు ఇక్కడ వైద్యం అందుబాటులో ఉందని వారు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. *STEMI* గా గుర్తించిన ఈ వ్యాధికి *THROMBLYSE,TENETCTE PLASE, STREPOTOKINASE వంటి అత్యంత ఖరీదైన మందులు ఇక్కడ లభిస్తున్నాయన్నారు. 2021 ఆగస్ట్ లో అందుబాటులోకి వచ్చిన ఈ మెడిసిన్ తో ఇప్పటి వరకు 15 మంది గుండెపోటు రోగులకు ప్రయోజనం కలిగిందని వారు సమీక్షలో వివరించారు.
అంతే గాకుండా హిమోపోలియ వ్యాదిన పడిన వారికి సైతం వైద్యం అందించే ప్రక్రియ సూర్యపేట ఆసుపత్రిలో ప్రారంభమైందన్నారు. ఇప్పటి వరకు ఉస్మానియా, గాంధీ ఆసుపత్రిలకు మాత్రమే పరిమితమైన ఈ వైద్యం ఇప్పుడు సూర్యాపేటలో అందుబాటులోకి తెచ్చమన్నారు. SACTOR-8,9లాంటి అత్యంత ఖరీదైన మందులు అందిస్తున్నాము అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యరంగంలో పేద ప్రజలకు ఎంతటి నాణ్యమైన సేవలు అందిస్తున్నారు అనడానికి పై రెండు తార్కాణంగా నిలుస్తోందన్నారు. దీనికి తోడు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో సరిగ్గా 100 రోజుల క్రితం ప్రారంభమైన స్పెషల్ న్యూ బర్న్ కేర్ యూనిట్ 20 పడకలతో విజయవంతంగా సేవలు అందిస్తున్నట్లు వైద్య విభాగాదిపతులు ఈ రోజు నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డికి వివరించారు.
భవిష్యత్ లో వైద్య రంగం అభివృద్ధికి ప్రభుత్వ పరంగా కేటాయించాల్సిన నిధులు,మంజూరు అయ్యాక సిబ్బంది విధులు ఈ సమీక్షా సమావేశంలో చర్చించారు. చివరిగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్,నీటి రంగాలలో అద్భుతమైన ఫలితాలు సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం వైద్యాన్ని, విద్యను బలోపేతం చేస్తున్నారన్నారు. అందులో భాగమే సూర్యాపేటలో వైద్యరంగంలో సాధించిన విజయాలుగా ఆయన అభివర్ణించారు. అంతే గాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలలో వైద్యులకు అందిస్తున్న ఆహారపు ధరలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారిగా రెట్టింపు చేశారన్నారు. హైపోరిటి, సాధారణ, డయాబెటిస్ లతో పాటు గర్భిణిస్త్రీలకు అందించే ఆహారపు ధరలను పెంచిన విషయాన్ని ఆయన తెలిపారు.
కొత్తగా అమలులోకి వచ్చిన విధానంతో పాత టెండర్లు రాడ్డుపరచి కొత్త టెండర్లు పిలిచారని అవి ఫైనల్ కావడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ రోజు ప్రారంభించుకున్నట్లు ఆయన వెల్లడించారు. వైద్యరంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలను అమలు పరుస్తున్న వైద్య సిబ్బందిని మంత్రి జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా అభినందించారు.