కార్మికులు ఆరోగ్యంగా ఉంటే నగరం ఆరోగ్యంగా ఉంటుంది: విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి

  • ఆరోగ్య భద్రతకై కార్మికులకు ఉచితంగా వైద్య పరిక్షలు
విజయవాడ: తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం నందు గురువారం విజయవాడ నగరపాలక సంస్థ పారిశుధ్య కార్మికులకు ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య పరిక్షలు శిబిరమును నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మరియు కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పర్యవేక్షించి కార్మికులకు చేస్తున్న పరీక్షలను పరిశీలించారు. 

ఈ సందర్భంలో మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నగరపాలక సంస్థ నందలి కార్మికులందరికి సుమారుగా రూ.5000/- విలువ గల వైద్య పరీక్షలను నగరపాలక సంస్థతో కలసి ఉచితంగా నిర్వహించుటకు ముందుకు వచ్చిన ఆంద్ర హాస్పిటల్ యాజమాన్యం మరియు డెంటల్ అసోసియేషన్ వారికి కార్మికుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేసి వారిని అభినందించారు. మీరందరూ ఆరోగ్యంగా ఉంటె నగరం కూడా ఆరోగ్యంగా ఉంటుందని, ప్రతి రోజు నగరాన్ని శుభ్రంగా ఉంచుటకై మీరు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. కార్మికల యొక్క ఆరోగ్య భద్రతకై నిర్వహిస్తున్న ఈ ఆరోగ్య  శిబిరం ద్వారా రక్త, గుండె, షుగర్, బి.పి వంటి వాటికీ పరిక్షలు నిర్వహించుట, ఇకో స్కానింగ్, కిడ్నీ స్కానింగ్ మొదలగునవి పరీక్షించి అవసరమైన వైద్య పరిక్షలు నిర్వహించి మందుకు అందించుట జరుగుతుందని, ఇంకను అవసరం అనుకుంటే వారికీ ఆరోగ్య శ్రీ ద్వారా ఆంధ్ర హాస్పిటల్ నందు వైద్య సేవలు అందించుట జరుగునని పేర్కొన్నారు.

కార్మికులందరూ ఈ వైద్య శిబిరములను సద్వినియోగ పరచుకోవాలి: కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ పి.హెచ్ వర్కర్ లతో పాటుగా ఇంజనీరింగ్, ఉద్యానవన శాఖా వంటి అన్ని విభాగములలో పనిచేయు కార్మికులకు ఇటువంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా అవసరమైన పరిక్షలు నిర్వహించుట జరుగుతుందని అన్నారు. కార్మికులందరూ శిబిరములను సద్వినియోగపరచుకోవాలని అన్నారు. ఆంధ్ర హాస్పిటల్ వారిచే పలు రోగ్యలకు సంబందించిన పరిక్షలు నిర్వహించుటతో పాటుగా డెంటల్ అసోసియేషన్ వారి సహకారంతో పంటికి సంబందించిన వ్యాదులకు కూడా పరిక్షలు నిర్వహించుట జరుగుతుందని అన్నారు.

కార్యక్రమములో చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఇన్ ఛార్జ్ డా.సి.హెచ్ బాబు శ్రీనివాసన్, ఆంధ్ర హాస్పిటల్స్ వైద్య నిపుణులు, డెంటల్ అసోసియేషన్ డాక్టర్లు మరియు నగరపాలక సంస్థ హెల్త్ అధికారులు, ఇతర సిబ్బందితో పాటుగా సుమారు 350 మంది కార్మికులు హాజరై వైద్య పరిక్షలు చేయించుకున్నారు.
VMC

More Press News