ప్రిపరేషన్ పై సరిగా దృష్టి పెట్టండి.. సక్సెస్ సాధిస్తారు: బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల సాధన కోసం ఏకాగ్రతతో చదివితే సక్సెస్ సాధిస్తారని బి.సి.వెల్ఫేర్ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం అభిప్రాయం వ్యక్తం చేశారు. లక్ష్యాన్ని ఎంచుకుని సరైన పద్దతిలో సబ్జెక్ట్ పై పట్టు సాధిస్తే విజయాలు వాటంతటవే వస్తాయన్నారు.ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో అభ్యర్థులకు సలహాలు-సూచనలు అందించేందుకు టి-సాట్ నెట్వర్క్ ఏర్పాటు చేసిన ప్రత్యేక అవగాహన కార్యక్రమానికి జూబ్లిహిల్స్ లోని టి-సాట్ స్టూడియోకు బుర్రా వెంకటేశం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రత్యక్ష్య కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ జోన్ల విభజన వలన స్థానిక కోటా పెరిగిఉద్యోగాలకు సివిల్స్ ఉద్యోగాల్లో ఒక ఉద్యోగానికి లక్ష మంది పోటీ పడుతుండగా తెలంగాణలో విడుదల చేసిన భారీ ఉద్యోగాల నొటిఫికేషన్ కారణంగా 95 శాతం స్థానికులకే అనే నిబంధనతో ఒక పోస్టుకు 10 మంది మాత్రమే పోటీ పడే అవకాశం ఉందని, నియామకాలలో ఇంటర్వూను తొలగించడం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక నిర్ణయమని, ఫలితంగా అభ్యర్థులు తమ నైపుణ్యంపైనే భరోసా వేసుకోవాల్సి ఉంటుందని బుర్రా స్పష్టం చేశారు.
భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ, స్థానికులకే 95 శాతం అవకాశాలు, నిరుద్యోగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం సరైన సమయం, అవకాశం ఇచ్చినందున నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని వెంకటేశం సూచించారు. 503 గ్రూప్-1 ఉద్యోగాలతో పాటు సుమారు 80 వేల ఉద్యోగాలను భర్తీకి నిర్ణయం భవిషత్య్ లో కష్ట సాధ్యమని అందుకే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యువతను కోరారు.
11 కేంద్రాల్లో ప్రత్యక్ష్య తరగతులు
బి.సి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణలోని ఆయా జిల్లాల్లో 11 బి.సి స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడే సుమారు 6,500 మందికి ప్రత్యక్ష్య బోధన చేస్తున్నామని ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. వీరందరికీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ అందిస్తున్నామన్నారు. గ్రూప్-1., ఎస్.ఐ., కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రస్తుతం కోచింగ్ అందిస్తున్నామని, భవిష్యత్ లో మరికొంత మందికి మరి కొన్ని ఉద్యోగాలపై కోచింగ్ అందించనున్నామని స్పష్టం చేశారు.టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లతో అనుసంధానమై సేవలు మరింత విస్తృత పరుస్తున్నామన్నారు.