పారిశుధ్య నిర్వహణ మెరుగుపర్చాలి: వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
- మేజర్ డ్రెయిన్ లలో సిల్ట్ తొలగించి, యాంటి లార్వాల్ ఆపరేషన్ పనులు చేపట్టాలి
ఈ సందర్భంగా సింగ్ నగర్, ప్రకాష్ నగర్, కుందావారి కండ్రిక, 33 తుమ్ములు, దేవినగర్ మొదలగు ప్రాంతాలలో మేజర్ అవుట్ డ్రెయిన్స్ బుడమేరు నందు కలియు ప్రాంతాలను పరిశీలించి అధికారులను వాటి వివరాలు అడిగి తెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. ఆయా డ్రెయిన్ నందలి సిల్ట్ తొలగింపు పనులు యుద్దప్రాతిపదిక చేపట్టి డ్రెయిన్స్ ద్వారా మురుగునీటి ప్రవాహం సక్రమంగా జరిగే విధంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, కండ్రిక ప్రాంతములోని మేజర్ అవుట్ ఫాల్ డ్రెయిన్ అందు పెరిగిన గుర్రపు డెక్కను తొలగించాలని ఆదేశించారు.
వార్డ్ సచివాలయాల బౌండరీలకు అనుగుణంగా మేజర్ డ్రెయిన్ లను కూడా వార్డ్ సచివాలయాల బౌండరీలలో గూగుల్ మ్యాప్ నందు పొండుపరచాలని పట్టణ ప్రణాళికా అధికారులను ఆదేశించారు.
నగర పరిధిలోని మేజర్ అవుట్ ఫాల్ డ్రెయిన్ల్ యందు సిల్ట్ తొలగించుటతో పాటుగా ఆయా ప్రాంతములలో దోమల లార్వా ఉత్త్పత్తిని నివారించాలని, నీటి గుంటలలో, డ్రెయిన్ లలో యం.ఎల్ ఆయిల్ బాల్స్ వేయుటతో పాటుగా పైరత్రం స్ప్రయింగ్, ఫాగ్గింగ్ నిర్వహణ మొదలగు యాంటి లర్వాల్ ఆపరేషన్ పనులు చేపట్టాలని మ్యానువల్ గా వీలుకాని ప్రదేశాలలో డ్రోన్ సహయంతో పైరత్రం స్ప్రే చేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు. తదుపరి పైపుల రోడ్ నుండి నగరపాలక సంస్థ పరిధి వరకు గల ఇన్నర్ రింగ్ రోడ్ మరియు నూజివీడు రోడ్ల యందలి మీడియన్ శుభ్రపరచి మొక్కలు నాటే పనులు చేపట్టి సుందరంగా తీర్చిదిద్దాలని ఉద్యానవన శాఖాధికారులను ఆదేశించారు.
పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జీ.గీతాభాయి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.శ్రీనివాస్, డిప్యూటీ ఇంజనీర్ గురునాద్ బాబు, హెల్త్ ఆఫీసర్ డా. రామకోటీశ్వరరావు మరియు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.