గుంటతిప్ప, పుల్లేటి డ్రెయిన్లను పరిశీలించిన వీఎంసీ కమిషనర్
- మురుగునీటి పారుదల సక్రమముగా పారేలా చర్యలు చేపట్టాలి
డ్రెయిన్ యొక్క స్దితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించుటకు అవసరమైన చోట్ల సీసీ కెమెరా మరియు మురుగునీటి తీవ్రత పరిశీలనకై సెన్సెర్ లను ఏర్పాటకు చర్యలు తీసుకోవాలని అన్నారు. డ్రెయిన్ నుండి దుర్వాసన రాకుండా చర్యలు తీసుకోనుటతో పాటుగా కేవలం శ్రీ శక్తీ ఫంక్షన్ హాల్ నుండి కాకుండా వేరొక మార్గముల ద్వారా మేజర్ డ్రెయిన్ నిర్మాణం చేపట్టి రైవస్ కాలువ కలిపే విధంగా నగరపాలక సంస్థ మరియు పీఆర్ డిపార్టుమెంటు అధికారులు సంయుక్త పర్యటన చేసి సమగ్ర నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
మేజర్ అవుట్ ఫాల్ డ్రెయిన్ పై పూర్తి స్లాబ్ లు వేసి అక్కడక్కడ వ్యర్ధములను తొలగించుటకు వీలుగా మ్యాన్ హోల్స్ ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గుంట తిప్ప డ్రెయిన్ మరియు పుల్లేటి డ్రెయిన్ లలో అవసరమైన చోట్ల గ్రేట్టింగ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పుల్లేటి డ్రెయిన్ నకు సంబందించి గుణదల ప్రాంతములో నిర్మాణం చేపట్టవలసిన ప్రాంతాన్ని పరిశీలిస్తూ, డ్రెయిన్ నిర్మాణము మరియు గ్రేట్టింగ్ ఏర్పాటుకు అవసరమగు అంచనాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. దీనితో పాటుగా మేజర్ డ్రెయిన్ నందు పాడైన చోట్ల డ్రెయిన్ మరమ్మత్తులు నిర్వహించుటకు తగిన ప్రణాళికలను సిద్దం చేయాలనీ అధికారులకు సూచించారు.
పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర్, ఎస్.ఇ పి.వి.కె భాస్కర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జీ.గీతాభాయి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.చంద్ర శేకర్, హెల్త్ ఆఫీసర్ డా.బి శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ ఎల్. పార్ధసారధి మరియు ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మహావీర్ జయంతి సందర్భంగా 14న మాంసం విక్రయాలు బంద్: కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వారి ఉత్తర్వులు ననుసరించి ది. 14-04-2022 మహావీర్ జయంతిని పురస్కరించుకొని నగరంలోని అన్ని చికెన్, మటన్ షాపులు మరియు చేపల మార్కెట్లు అన్నింటికి సెలవు ప్రకటించడమైనది. నగరంలో ఉన్న కబేళ కు కూడా సెలవు ప్రకటించడమైనది. ఎవరైనా నిభందనలను పాటించకుండా షాపులు తీసి వ్యాపారం చేసిన యెడల చట్ట ప్రకారం కమిషనర్ వారి ఉత్తర్వులు మేరకు చర్యలు తీసుకోవటం జరుగునని వి.ఏ.ఎస్ డా.రవి చంద్ ఈ ప్రకటన ద్వారా హెచ్చరించారు.
అదే విధంగా నగర వీధులలో ఇష్టానుసారంగా పశువులను (ఆవులు) వదిలి వేయుట కారణంగా పారిశుధ్య నిర్వహణకు మరియు ప్రజల, వాహనముల రాకపోకలకు తీవ్ర అవరోధం కలుగుతున్న దృష్ట్యా గోవుల యాజమానులు తమకు సంబందించిన గోవుల రోడ్లపై సంచరించకుండా చూడాలని హెచ్చరిస్తూ, ఆదేశాలు పాటించ యెడల నగరపాలక సంస్థ తగు చర్యలు తీసుకోవటం జరుగుతుందని అన్నారు.