విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు: వీఎంసీ కమిషనర్

  • విధులలో అలసత్వం వహించిన ఇరువురు సిబ్బందికి షోకాజ్ నోటీసు
  • క్షేత్ర స్థాయి పర్యటనలో ఆదేశాలు
విజ‌య‌వాడ‌: సింగ్ నగర్ ప్రాంతములోని 59వ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులతో కలసి పర్యటిస్తూ, పారిశుధ్య పరిస్థితిని పరిశీలించగా 244 సచివాలయం పరిధిలో పారిశుధ్య నిర్వహణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంబందిత శానిటరీ సెక్రటరీ మరియు యం.కె బెగ్ స్కూల్ నందలి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లకుండా విధులలో అలసత్వం వహించిన ప్రధానోపాధ్యాయుని ఇరువురుకి షోకాజ్ నోటీసు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా జోనల్ కమీషనర్లు ప్రతి రోజు ఉదయం క్షేత్ర స్థాయిలో పారిశుధ్య నిర్వహణ తీరును పర్యవేక్షణ చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

తడి చెత్త నుండి విధ్యుత్ ఉత్పత్తి చేయు బయో మెథనైజేషన్ ప్లాంట్ మరియు మురుగునీటిని శుద్ధి చేయు 60 యం.ఎల్.డి సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకోన్నారు. 15వ ఆర్ధిక సంఘ నిధులతో ప్లాంట్ నందు చేపట్టవలసిన మరమత్తుల మరియు రినోవేషన్ పనుల యొక్క వివరాలు అడిగితెలుసుకొని అధికారులకు పలు సూచనలు చేసారు.

ఈ సందర్భంగా ప్రతి ప్లాంట్ ఆహ్లాదకరంగా ఇండస్ట్రియల్ వాతావరణ కలిగి ఉండే విధంగా తీర్చిదిద్దాలని, ఆరోగ్యకరమైన వాతావరణంలో ఆయా ప్లాంట్లను నిర్వహించినట్లయితే ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండుటయే కాకుండా ఆయా ప్లాంట్ లలో సి.సి రోడ్లు మరియు కాంపౌండ్ వాల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవటం జరుగుతుందని అన్నారు. విజయవాడ నగరం ఆహ్లాదకరంగా మరియు ఆరోగ్యకరంగా ఉండుటకు ప్రజలు కూడా సహకారం అందించి ఎవరు కూడా రోడ్లపై లేదా డ్రెయిన్ లలో చెత్త మరియు వ్యర్దములు పడవేయరాదని పిలుపునిచ్చారు.

అదే ప్రాంతములోని పలు విధులలో పర్యటిస్తూ, రోడ్ల, డ్రెయిన్ నందలి మురుగునీటి పారుదల విధానము మరియు పారిశుధ్య నిర్వహణ తీరును పర్యవేక్షించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొన్నారు. స్థానికంగా ప్రజలకు ఎదురౌతున్న ఇబ్బందులను స్థానిక కార్పొరేటర్ కమిషనర్ దృష్టికి తీసుకురాగా వాటిని పరిశీలించి సమస్యల పరిష్కారం కొరకు తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. తదుపరి యం.కె.బేగ్ ఉన్నత పాఠశాలను సందర్శించి బోధన విధానము మరియు స్కూల్ యొక్క నిర్వహణ తీరును పరిశీలించిన సందర్భంగా నగరపాలక సంస్థ ద్వారా 10వ తరగతి విద్యార్ధులకు అందిస్తున్న అల్పాహారము యొక్క వివరాలు తెలుసుకొని పిల్లలకు అందిస్తున్న ఆహారాన్ని స్వీకరించి సంతృప్తిని వ్యక్తం చేస్తూ, చిన్నారులకు మంచి నాణ్యమైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని సూచించారు.

పాఠశాల యందలి మరుగుదొడ్ల నిర్వహణతో పాటుగా పరిసరాలను పరిశీలించి నిర్వహణ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, పరిసరాలు అన్నియు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశిస్తూ, స్కూల్ ఆవరణలో గల వ్యర్దాములను తొలగించి పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని సంబందిత అధికారులు మరియు ఉపాద్యాయులను ఆదేశించారు. నాడు నేడు క్రింద సదరు పాఠశాల నందు చేపట్టవలసిన పనుల వివరాలు అడిగితెలుసుకొని, పాఠశాల నందు చేపట్టవలసిన చిన్న చిన్న రిపేర్లులకు అంచనాలు తయారుచేసి వెంటనే పనులు చేపట్టి పూర్తి చేసేలా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

అనంతరం యం.జి రోడ్ నందలి రాఘవయ్య పార్క్ ను సందర్శించి పార్క్ నకు ప్రతి రోజు ఎంత మంది వస్తున్నది కౌంటర్ నందలి రిజిస్టర్ ను పరిశీలిస్తూ, పార్క్ లోపల గల వంతెన యొక్క వివరాలు అడిగితెలుసుకోని పలు సూచనలు చేసారు. సందర్శకులను ఆకర్షించేలా పార్క్ పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉండేలా చూడాలని సూచించారు.

పై ప్రదేశాలలో పర్యటించిన సందర్బంలో బి. ఆర్.టి. ఎస్ రోడ్డు, ఫుడ్ జంక్షన్ తదితర ప్రాంతాలలో అన్నదికార హోర్దింగ్ మరియు ఫ్లెక్సీ లను తొలగించాలని పట్టణ ప్రాంత అధికాలను ఆదేశించారు.

పర్యటనలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జీ.గీత బాయి, ఎస్.ఇ పి.వి.కె భాస్కర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, వెంకటేశ్వర రెడ్డి, హెల్త్ ఆఫీసర్ రామకోటేశ్వరరావు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు మరియు స్థానికులు తదితరులు పాల్గొన్నారు. 

More Press News