పాయకాపురం చెరువు పార్కు అభివృద్ధి పనులను పరిశీలించిన వీఎంసీ కమిషనర్

  • ఆకర్షనీయంగా, ఆహ్లాదకరమైన పార్క్ గా తీర్చిదిద్దాలి
విజ‌య‌వాడ‌: నగరపాలక సంస్థ కమిషనర్ రంజిత్ భాషా సింగ్ నగర్ ప్రాంతములో గల పాయకాపురం చెరువు నందలి పార్క్ అభివృద్ధి పనులను అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా చేపట్టిన పనులు వివరాలు మరియు వాటి పురోగతిని అధికారులను అడిగితెలుసుకొని పలు సూచనలు చేశారు. ప్రజలకు ఆహ్లాదం అందించుటతో పాటుగా ఆకర్షనీయమైన మొక్కలను ఏర్పాటు సుందరంగా తీర్చిదిద్దాలని అన్నారు.

ముసాఫర్ ఖానా ప్రారంభానికి సిద్దం చేయాలి: కమిషనర్ రంజిత్ భాషా

ఒన్ టౌన్ పశ్చిమ రైల్వే స్టేషన్ ప్రాంతములోని (ముసాఫర్ ఖానా) షాదీఖానాను నగర కమిషనర్ రంజిత్ భాషా అధికారులతో కలసి పరిశీలించి, ఇంకను పూర్తి చేయవలసిన పనుల వివరాలు సంబందిత అధికారులను అడిగితెలుసుకొని పలు సూచనలు చేస్తూ, పనులు వేగవంతము చేసి నెలాఖరు నాటికీ అప్పగించాలని సంబందిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు.

పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయి, ఎస్.ఇ పి.వి.కె భాస్కర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వి.శ్రీనివాస్, వెంకటేశ్వర రెడ్డి, హెల్త్ ఆఫీసర్ డా.రామకోటీశ్వరరావు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

గృహ నిర్మాణ గ్రౌండింగ్  పనులు వేగవంతము చేయాలి: నగరపాలక సంస్థ కాంట్రాక్టర్లకు సూచించిన జిల్లా కలెక్టర్ జె.నివాస్
నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ నందు ఏ.పి పట్టణ మౌలిక వసతుల సముదాయాల సంస్థ (టిడ్కో) ఆధ్వర్యంలో చేపడుతున్న గృహ నిర్మాణాలకు సంబంధించి కాంట్రాక్టర్ లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జె.నివాస్, నగరపాలక సంస్థ కమిషనర్ పి.రంజిత్ భాషా, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) శ్రీవాస్ నుపుర్ అజయ్ కుమార్, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు.సి.డి) డా.జె. అరుణ, పి.డి హౌసింగ్ రామచంద్రన్ పాల్గొన్నారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు - పేదలందరికీ ఇళ్ళు పథకమునకు సంబందించి జగనన్న కాలనీ ప్రక్రియ వేగవంతము చేయుటకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా లేఅవుట్ ప్రకారం జియో టాగింగ్, మ్యాపింగ్ చేసి నగరపాలక సంస్థ పరిధిలోని 33 వేల గృహ గ్రౌండ్ చేయునట్లుగా చర్యలు చేపట్టి నెలాఖరు నాటికీ పూర్తి చేయాలని చేయాలని అన్నారు.

పై సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎ.ఎస్.ఎన్ ప్రసాద్, టిడ్కో హౌసింగ్ అధికారులు, నగరపాలక సంస్థ కాంట్రాక్టర్లు, యు.సి.డి సిబ్బంది మరియు సచివాలయ ప్లానింగ్ ఎనిమిటి సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.

More Press News