డివిజన్ పరిధిలో చిన్న చిన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి: విజయవాడ మేయర్

విజయవాడ: తూర్పు నియోజక వర్గ పరిధిలోని 17వ డివిజన్ నందు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి,  స్థానిక కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి మరియు అధికారులతో కలసి డివిజన్ పరిధిలోని చలసాని నగర్ సాంపిల్ బిల్డింగ్ తదితర ప్రాంతాలను సందర్శించి అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలను స్వయంగా పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మాన్ హోల్స్ ను మరియు పారిశుధ్య నిర్వహణ విధానమును పరిశీలించి, నివాసాల నుండి చెత్తను సేకరించు సిబ్బంది యొక్క పనితీరును, సైడ్ డ్రైన్స్ మరియు అండర్ గ్రౌండ్ డ్రెయినేజి నిర్వహణ తీరును పరిశీలించిన సందర్భంలో పలు చోట్ల యు.జీ.డి మ్యాన్ హోల్స్ మూతలు సక్రమముగా లేకపోవుట గమనించి తక్షణమే వాటిని సరిచేయాలని సంబందిత అధికారులకు సూచించారు. అదే విధంగా డివిజన్లో పారిశుధ్య నిర్వహణ విధానము కూడా సక్రమముగా నిర్వహించేలా చూడాలని ప్రజారోగ్య అధికారులకు సూచించారు.

45వ డివిజన్ నందలి ఉర్దూ మహిళా జూనియర్ కళాశాలలో వసతుల పరిశీలన:

నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, యం.యల్.సి. మొహమ్మద్ రుహుల్లా మరియు స్థానిక కార్పొరేటర్ తో కలసి 45వ డివిజన్ పరిధిలో గవర్నమెంట్ ఉర్దూ మహిళా జూనియర్ కళాశాల నందలి అభివృద్ది పనులు మరియు భవన నిర్మాణమును పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్దులకు అన్ని మౌళిక సదుపాయములు అందుతున్నాయా లేదా అని ఉపాద్యాయులను అడిగి తెలుసుకున్నారు.

పర్యటనలో స్థానిక కార్పొరేటర్లు తంగిరాల రామిరెడ్డి మైలవరపు మధురి లావణ్య, 54వ డివిజన్ కార్పొరేటర్ అబ్దుల్ అకీబ్ అర్షద్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయి,  ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణమూర్తి, హెల్త్ ఆఫీసర్ డా.ఇక్బాల్ హుస్సేన్  మరియు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

రామలింగేశ్వర నగర ప్రాంతములో అందుబాటులోకి క్రిస్టియన్ స్మశాన వాటిక:
తూర్పు నియోజకవర్గం పరిధిలోని 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్ నందు రూ. రూ. 50 లక్షల నిధులతో అభివృద్ధి పరచిన క్రిస్టియన్ స్మశాన వాటికను నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతూ శ్రీ శైలజా రెడ్డి మరియు పలువురు కార్పోరేటర్లతో కలసి ప్రారంభించారు.

ఈ సందర్భంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడతూ నియోజకవర్గంలో క్రిస్టియన్ స్మశాన వాటిక నందు సరైన స్థలము లేకపోవుట కారణంగా పడుతున్న ఇబ్బందులు పరిష్కారం మరియు వారు చిరకాలంగా ఎదురు చూస్తున్న క్రిస్టియన్ స్మశాన వాటికను నేడు వై.సి.పి ప్రభుత్వ సహకారంతో దేవినేని అవినాష్ తో అందుబాటులోకి తీసుకురావటం సంతోషకరమని అన్నారు.

గత 20 ఏళ్లుగా చాలిచాలని స్మశాన వాటికతో ఈ ప్రాంత వాసులు అనేక ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా సమస్యను పరిష్కారించుటలో చొరవ చూపటం జరిగిందని పేర్కొన్నారు. అదే విధంగా నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి పరచుటకు మా తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్, ఎంతగానో కృషి చేస్తున్నారని, రోడ్లు, డ్రైయిన్లు, పార్క్ వంటి అన్ని అభివృద్ధి కార్యక్రమములు కేవలం శంఖుస్థాపనలు చేయటమే కాకుండా వాటిని అందుబాటులోకి తీసుకురావటం జరుగుతుందని వివరించారు. రాబోవు రోజులలో కూడా నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని అన్నారు.

క్రిస్టియన్ స్మశాన వాటిక దళితుల చిరకాల కోరిక: తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్

 తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్, మాట్లాడుతూ గత ప్రభుత్వం స్థలం మంజూరు చేసి నిధులు కేటాయించినపట్టికి అభివృద్ధిని విస్మరించి పరిపాలన సాగించిందని, అభివృద్ధి,  సంక్షేమ రెండు సమానంగా మా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. దళిత కుటుంబాల వారికీ అందుబాటులో ఉండే విధంగా నేడు ఈ  క్రిస్టియన్ స్మశాన వాటికను అభివృద్ధి పరచి అందుబాటులోనికి తీసుకురావటం జరిగిందని వివరించారు. అందరి సహకారంతో నియోజక అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం వై.సి.పి ప్రభుత్వం అని, ఇప్పటికే సుమారుగా రూ. 35౦ కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టినట్లు అయన వివరించారు.

తదుపరి డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతూ శ్రీ శైలజా రెడ్డి ప్రసంగించారు. కార్యక్రమములో పలువురు కార్పొరేటర్లు, అధికారులు, క్రిస్టియన్ పెద్దలు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

వేసవిలో త్రాగునీటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలి: కమిషనర్ రంజిత్ భాషానగరపాలక సంస్థ కమిషనర్ పి.రంజిత్ భాషా బుధవారం అధికారులతో కలసి డా.కె.ఎల్ రావు హెడ్ వాటర్ వర్క్స్ యొక్క నిర్వహణ విధానమును మరియు నగర పరిధిలోని వివిధ రిజర్వాయర్లకు రక్షిత నీటి సరఫర విధానముపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు.

రాబోవు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కడ ఎటువంటి సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా వేసవిలో నాచు శాతం అధికంగా ఉత్పత్తి ఆగుటకు అవకాశం ఉన్నందున రా వాటర్ ను శుద్ధి చేయు సమయంలో కాపర్ సేల్ఫడ్, యాక్టివేటేడ్ కార్బన్, ఆలమ్ మరియు క్లోరిన్ గ్యాస్ తగిన మోతాదులో ఉండేలా చూచి ప్రజలకు అందించు నీటి సరఫరాలో ఇబ్బంది రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

పర్యటనలో ఎస్.ఇ పి.వి.కె భాస్కర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణమూర్తి, మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

More Press News