ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జల్లా అటవీశాఖ వినూత్న కార్యక్రమం

  • ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులతో మృగవని జాతీయ పార్క్ లో ప్రత్యేక అవగాహన ప్రోగ్రామ్
రంగారెడ్డి: ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా అటవీశాఖ రంగారెడ్డి జిల్లా విభాగం వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది. అజీజ్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులను మృగవని జాతీయ ఉద్యానవనానికి అటవీ శాఖ ఆహ్వానించింది. 

అడవులు, పర్యావరణం, వాతావరణ మార్పులపై వివిధ కార్యక్రమాలను నిర్వహించి విద్యార్థుల్లో అవగాహన పెంపునకు కృషి చేసినట్లు రంగారెడ్డి జిల్లా చీఫ్ కన్జర్వేటర్ సునీతా భగవత్ తెలిపారు. పర్యావరణ రక్షణకు విద్యార్థుల్లో అవగాహన పెరగటం చాలా అవసరం అని, తద్వారా వారు మిగతా సమాజానికి సంధానకర్తల్లా పనిచేస్తారని ఆమె అన్నారు.  

అడవులు, జంతువులు, ప్రకృతి ఫోటోలు, పెయింటింగ్స్ తో కూడిన ప్రత్యేక ఎగ్జిబిషన్ ను విద్యార్థులకు ప్రదర్శించారు. అలాగే మృగవని నేషనల్ పార్కు విశిష్టత, అక్కడ ఉన్న జీవ వైవిధ్యంపై విద్యార్థులకు వివరించారు. స్టూడెంట్స్ అందరితో మొక్కలు నాటించటంతో పాటు, వారికి డ్రాయింగ్, పెయిటింగ్, వ్యాసరచన పోటీలను నిర్వహించి బహుమతులు అందించారు. 

కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అటవీ శాఖ అధికారి జానకిరామ్, శంషాబాద్ డివిజనల్ ఆఫీసర్ విజయానంద్, అసిస్టెంట్ కన్జర్వేటర్ మక్సూద్, మృగవని పార్కు అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో ప్రపంచ అటవీ దినోత్సవ ఉత్సవాలు:  
  1. ముఖ్య అతిథిగా పాల్గొన్న హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ పి.నవీన్ రావు, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్
  2. కేబీఆర్ పార్క్ లో మొక్కలు నాటిన చీఫ్ జస్టిస్, అతిథులు
  3. పార్క్ ఖాళీ స్థలంలో మర్రి మొక్కను నాటిన చీఫ్ జస్టిస్, నేరేడు మొక్కను నాటిన జస్టిస్ నవీన్ రావు, వేప మొక్కను నాటిన ఎంపీ సంతోష్ కుమార్
  4. తెలంగాణకు హరితహారం ద్వారా జంగిల్ బచావో- జంగిల్ బడావో నినాదంతో చేపట్టిన కార్యక్రమాలను చీఫ్ జస్టిస్ కు వివరించిన అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్.ఎం. డోబ్రియాల్
  5. ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించిన తర్వాత, పార్క్ లో వాకింగ్ చేసిన చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ నవీస్ రావు
నడక మార్గంలో నెమలి ఎదురుపడిన, పురివిప్పటంతో చీఫ్ జస్టిస్ ఆనందం వ్యక్తం చేశారు. జస్టిస్ నవీన్ రావు తన సెల్ ఫోన్ లో నెమలి ఫోటోలను తీసుకున్నారు. ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్క్ లు చాలా బాగున్నాయని చీఫ్ జస్టిస్ అన్నారు.

ఎంపీ సంతోష్ కుమార్ కామెంట్స్:
''అందరికీ ప్రపంచ అటవీ దినోత్సవ శభాకాంక్షలు. గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ మార్పులను ఎదుర్కోవడానికి విరివిగా మొక్కలు నాటడమే మార్గం. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా సమాజంలో ప్రతి ఒక్కరూ మూడు పీ -పార్టిసిపేట్, ప్లాంట్, ప్రొటక్ట్ లను విధిగా అనుసరించాలి (Three P - Participate, Plant, Protect)'' అని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ హితం కోసం తీసుకుంటున్న కార్యక్రమాల్లో అందరి భాగస్వామ్యం ఉండాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎంజె అక్బర్, హైదరాబాద్, మేడ్చల్, యాదాద్రి డీఎఫ్ఓ లు ఎం.జోజి, వెంకటేశ్వర్లు, డీవీ రెడ్డి, కేబీఆర్ పార్క్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

More Press News