జూనియర్ నేషనల్స్ హ్యాండ్ బాల్ టోర్నమెంటుపై విజ‌య‌వాడ‌ మేయర్ సమీక్ష

  • క్రీడాకారులకు అసౌకర్యం కలుగకుండా తగిన మౌళిక వసతులు కలిపించాలి
విజయవాడ నగరంలో మార్చి 31వ తారీఖు నుండి జరగనున్న జూనియర్ నేషనల్స్ హ్యాండ్ బాల్ టోర్నమెంటు నిర్వహణకు సంబందించి నగరపాలక సంస్థ ద్వారా ఏర్పాటు చేయవలసిన వసతి సదుపాయాలపై నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తన ఛాంబర్ నందు స్పోర్ట్స్ & ట్రాఫిక్ చైర్మన్ పెనుమత్స శిరీష మరియు స్పోర్ట్స్ అధికారులతో సమీక్షించి పలు అంశాలపై చర్చించారు.

ప్రధానంగా వివిధ రాష్ట్రాల నుండి వచ్చే క్రీడాకారులు, కోచ్చులు మరియు రిఫరీలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా విజయవాడ నగరపాలక సంస్థ నుండి మౌళిక వసతులకు ఏర్పాటు చేయవలసినదిగా హ్యాండ్ బాల్ అసోసియేషన్, కృష్ణా జిల్లా కోచ్ పెనుమత్స సత్యనారాయణ రాజు మేయర్ కి వివరిస్తూ, టోర్నమెంట్ విజయవంతం అయేలా సహకరించాలని కోరియున్నారు. దీనిపై మేయర్ క్రీడాకారులకు వసతి ఏర్పాటు చేయుటకు అనువైన ప్రదేశాలను అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేస్తూ, మౌళిక సదుపాయాల కల్పనలో తగు జాగ్రత్తలు తీసుకోని ఇబ్బంది కలుగకుండా చూడాలని డైరెక్టర్ అఫ్ స్పోర్ట్స్ ఇంచార్జి ఉదయ్ కుమార్, మరియు సంబంధిత అధికారులకు సూచించారు.

సమావేశంలో డైరెక్టర్ అఫ్ స్పోర్ట్స్ ఇంచార్జి ఉదయ్ కుమార్, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎడ్యుకేషన్ అధికారి ఇన్ ఛార్జ్ కె.వి.వి.వి రాజు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

More Press News