రక్షిత త్రాగునీటి సరఫరాకు ప్రథమ ప్రాధాన్యం: వీఎంసీ కమిషనర్
- హెడ్ వాటర్ వర్క్స్ సందర్శించిన నగర పాలక సంస్థ కమిషనర్ పి రంజిత్ బాషా
విజయవాడ నగరానికి మంచినీటి సరఫరా చేసే ప్రధాన వాటర్ వర్క్స్ ను మంగళవారం అధికారులతో కలసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా హెడ్ వాటర్ వర్క్స్ ద్వారా నీటిని శుద్ధి చేయు విధానం మరియు వివిధ ప్రాంతాలలోని రిజర్వాయర్ లకు త్రాగు నీటిని పంపింగ్ చేయు తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజు ఎంత పరిమాణంలో నీటిని శుద్ధి చేయుచున్నది, రోజుకు ఎన్ని సార్లు, ఎంత సమయం నీటిని ప్రజలకు సరఫరా చేస్తున్నది అడిగి తెలుసుకొన్నారు.
నగరానికి మంచినీటిని సరఫరా చేసే హెడ్ వాటర్ వర్క్స్ లో విధులు నిర్వహించే సిబ్బంది అన్ని విషయాలలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని, కృష్ణానది నుంచి ఇక్కడ నీటిని శుద్ధి చేసే క్రమంలో ఆలం పరిమాణం కోద్ధి కలపాలని శుద్ధి ఐన నీటిని ఎప్పటికప్పుడు ల్యాబ్ కి టెస్టుకు పంపుతూ ఎంతో అప్రమత్తంగా ఉండాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అదే విధంగా త్రాగునీటి పైపు లైన్ లో ఏమైన లికేజీలు ఏర్పడినచో, యుద్ధప్రాతిఫధికన వాటికి తగిన మరమ్మత్తులు చేపట్టి నీటి వృధాను అరికట్టాలని సూచించారు.
తదుపరి హెడ్ వాటర్ ప్రాంగణంలో గల ఇన్ టేక్ వెల్, వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్ మరియు వాటర్ స్కాడా యూనిట్, వాటర్ టెస్టింగ్ ల్యాబ్ మొదలుగునవి పరిశీలించి వాటి యొక్క నిర్వహణ మరియు పనితీరును అధికారులను అడిగితెలుసుకున్నారు.
పై పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణమూర్తి, మరియు హెల్త్ ఆఫీసర్ ఇక్బాల్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.