మేడారం జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి: తెలంగాణ మంత్రులు

ములుగు జిల్లా: జనవరి 29 (శనివారం): దక్షిణాది అతిపెద్ద కుంభమేళాను తలపించే గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే మేడారం గిరిజన జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు భక్తులకు ఏర్పాట్లు దాదాపు పూర్తి అయినవని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, గిరిజన సంక్షేమ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

శనివారం రోజున ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధ్యక్షతన రాష్ట్ర మంత్రులు, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి మంత్రులు హెలికాప్టర్ ద్వారా మేడారం జాతర ఏర్పాట్ల పరిశీలనకు విచ్చేసిన వీరికి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభించారు.

అనంతరం జంపన్న వాగు ప్రాంతాలను పరిశీలించి ప్రభుత్వ సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జాతర ఏర్పాట్లపై వివిధ శాఖల ద్వారా చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ వీరితో పాటు జిల్లా శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు, మూలుగు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ముందుగా వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం:
  • మేడారం జాతర ఏర్పాట్లపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు మేడారానికి వచ్చే ప్రతి సామాన్య భక్తునికి సమ్మక్క-సారలమ్మ ఆశీస్సులు పొందాలని దృఢసంకల్పంతో ఉన్నారని అన్నారు.
  • మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి ఫిబ్రవరి 18వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు వచ్చే అవకాశం ఉందని అన్నారు.
  • తెలంగాణ వచ్చిన తర్వాత మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు అత్యంత గౌరవం దక్కిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఇప్పటి వరకు మేడారం జాతరకు 332 కోట్లతో భక్తులకు సకల సౌకర్యాలు కల్పించామని తెలిపారు.
  • జిల్లా పంచాయతీరాజ్ శాఖ ద్వారా, పరిసరాల పరిశుభ్రతపై దృష్టి పెట్టి, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలతో జాతర నిర్వహిస్తామన్నారు.
  • పర్యావరణ పరిశుభ్రతను పాటిస్తూ జాతర ఘనంగా నిర్వహిస్తామన్నారు.
  • జాతర దగ్గరికి వస్తుంది కోవిడ్ ఒమేక్రాన్ కారణంగా ప్రభుత్వం జాతర నిర్వహిస్తుందో లేదో అనే సందిగ్ధంలో భక్తులు ఉన్నారని, భక్తుల సందిగ్ధానికి తెరదించి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శాశ్వత నిర్మాణాలకు ప్రాధాన్యతనిస్తూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తున్నామని తెలిపారు.
జాతర విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పం మేరకు ఇక్కడికి రావడం జరిగిందని జాతర ఏర్పాట్లపై జిల్లా పాలనాధికారి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ 90 శాతం పనులు పూర్తి చేయడం జరిగిందని మిగిలిన పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన ఫిబ్రవరి మొదటి వారంలోగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

More Press News