ఆహ్లాదకర వాతావరణంలో సందర్శకులను ఆకర్షించేలా రాజీవ్ గాంధీ పార్కును తీర్చిదిద్దాలి: విజయవాడ మేయర్

ఆహ్లాదకర వాతావరణంలో సందర్శకులను ఆకర్షించేలా రాజీవ్ గాంధీ పార్కును తీర్చిదిద్దాలి: విజయవాడ మేయర్
విజ‌య‌వాడ‌: రాజీవ్ గాంధీ పార్కు అభివృద్ధి పనులను మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధికారులతో కలిసి పర్యవేక్షించారు. పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఆటపరికరముల ఏర్పాటు సందర్శకుల సౌకర్యార్ధము ఏర్పాటు చేసిన టాయిలెట్స్, గ్రీనరీ పనులను పర్యవేక్షించారు. సందర్శకులు చక్కని అనుభూతిని పొందు విధంగా ఇతర ప్రాంతాల వారిని కూడా ఆకర్షించే విధముగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించినారు.

పర్యటనలో శ్రీ రుహుల్లా, ఎస్టేట్ ఆఫీసర్ టి. శ్రీనివాస్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పార్క్ AE మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

More Press News