గుణదల రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష

  • సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యుడు మల్లాది విష్ణు, కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యుడు మల్లాది విష్ణు, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో సెంట్రల్ నియోజక వర్గ పరిధిలోని పలు అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించి పనుల యొక్క వివరాలు మరియు వాటి పురోగతిని అడిగి తెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు.

గుణదల ప్రాంతములో చేపట్టిన రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల యొక్క స్దితిగతులపై సమీక్షిస్తూ, రెవిన్యూ, ఎలక్ట్రికల్ మరియు పోలీస్ డిపార్టుమెంటు వారు సమన్వయముతో నిర్మాణ పనులకు ఆటంకముగా ఉన్న ఏవిధమైన అభ్యంతరము లేని నిర్మాణములను నెలాఖరు లోపుగా తొలగించాలని సంబందిత అధికారులకు సూచించారు. న్యాయ పరమైన సమస్యలు ఏమైనా ఉన్నచో ప్రభుత్వ ప్లేడర్ తో సంప్రదించి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళికాధికారులను ఆదేశించారు. లబ్దిదారుల చెల్లింపు విషయమై తగిన చర్యలు గైకొనవలసినదిగా ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు.సి.డి) ను ఆదేశించారు.

అదే విధంగా అర్బన్ సర్వేయర్ మరియు టౌన్ సర్వేయర్ సంయుక్తంగా ఏలూరు రోడ్ విస్తరణకు సంబందించిన సబ్ డివిజన్ కేసును రెండు రోజులలో పరిష్కరించవలెనని ఆదేశించారు. అన్ని విభాగముల అధికారులు సమన్వయము చేసుకొని నిర్మాణ పనులకు ఎటువంటి అవరోధం కలుగకుండా పనులు వేగవంతముగా పూర్తి అయ్యేలా సమిష్టి కృషి చేయాలని నిర్ణయించారు.

సమావేశంలో 1వ డివిజన్ కార్పొరేటర్ ఉద్దంటి సునీత, ACP (ట్రాఫిక్), సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, ప్రాజెక్ట్ ఆఫీసర్ టి.సుధాకర్, ఆర్ అండ్ బి ఇంజనీర్లు, యం.ఆర్.ఓ (నార్త్), CPDCL ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ADE, DEE – SPDCL మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుదలకు శిక్షణ కార్యక్రమము ఎంతో ఉపయోగపడుతుంది: నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం నందు మూడు రోజుల పాటు దీన దయాళ్ అంత్యోదయ యోజన మరియు స్వచ్చ భారత్ మిషన్ కన్వర్జెన్స్ ప్రోగ్రామ్ పై శిక్షణ కార్యక్రమమును నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంలో మేయర్ మాట్లాడుతూ దీన దయాళ్ అంత్యోదయ యోజన మరియు స్వచ్చ భారత్ యొక్క సంయుక్త కార్యక్రమం ముఖ్యంగా మెప్మా గ్రూప్ సభ్యుల జీవన శైలిని మెరుగుపరుచుటకు ఈ కార్యక్రమము ఉద్దేశించినదని, గ్రూప్ సభ్యులకి జీవనోపాధి మార్గాలు పెరగటమేకాక, నగరపాలక సంస్థ నందు పారిశుద్ధ్యం మెరుగుపడుటకు అవకాశం ఉంటుందని అన్నారు.

శిక్షణ ఇచ్చుట ద్వారా బలహీన వర్గాలయిన పారిశుద్ధ్య వృత్తికి చెందినవారు, దివ్యంగులు, ట్రాన్స్ జన్డర్, రిక్షా కార్మికులు మరియు నిర్మాణ రంగములోని పని చేసుకోను వారిని గుర్తించి, వారిని మెప్మా గ్రూప్ గా చేయుట మాత్రమే కాకుండా, వారికి వివిద పారిశుద్ధ్యమునకు సంబంధించిన జీవనోపాదులలో శిక్షణ కల్పించి, వారి సామాజిక స్థాయిని పెంపొందించుటయే ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. సిబ్బందిలో అవగాహనా కల్పించుట వల్ల పారిశుద్ధ్యం మెరుగుపడుతుంది, ప్రతి ఒక్కరు ఉత్సాహంగా శిక్షణలో పాల్గొని రాబోవు రోజులలో మన నగరం ప్రధమ స్థానములో నిలిపేందుకు ప్రతి ఒక్కరం సమష్టిగా కృషి చేయవలసిన భాద్యత మనందరిపై ఉందని అన్నారు.

నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్ ఆఫీసర్) యు.శారద దేవి పర్యవేక్షణలో ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు.సి.డి) టి.సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డా.సురేష్ మరియు Kum Sreya coordinator ig Urban management centre, Alhabad పరోక్షంగా మరియు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ కల్పించారు.

వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలి: నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలని, తద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి చెప్పారు. గురువారం పాల ఫ్యాక్టరీ సమీపంలోని సయ్యద్ అప్పలస్వామి కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను మేయర్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ చదువులను ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి జగనన్న ప్రభుత్వం విద్యార్థుల కోసం అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. విద్యార్థినీ విద్యార్థులు చక్కగా చదువుకొని మంచి భవిష్యత్తును సాధించాలని మేయర్ ఆకాంక్షించారు. ఎస్.ఏ.ఎస్ కాలేజీ వెనక వైపున ఉన్న కొండ రోడ్డు రిటర్నింగ్ గోడ ప్రమాదకరంగా ఉందని కరస్పాండెంట్ జయప్రకాష్ మేయర్ దృష్టికి తీసుకెళ్లగా సదరు గోడను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ దండాబత్తిన సరళ, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అజ్మీర రాంపండు నాయక్, తదితరులు పాల్గొన్నారు.

More Press News