అభివృద్ధి దిశగా ఆధ్యాత్మిక కేంద్రంగా తెలంగాణ: చినజీయర్ స్వామి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా సస్యశ్యామలంగా సుఖసంతోషాలతో వర్థిల్లుతుందని అందుకు కేసీఆర్ 7 ఏండ్ల పాలన సాక్షిగా నిలిచిందని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. శుక్రవారం ముచ్చింతల్లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలొ మున్సిపల్ కమీషనర్ డా// యన్ యాదగిరి రావు వెలువరించిన “ప్రగతి”-7 ఏళ్లలో 70 ఏండ్ల అభివృద్ది కాఫీటెబుల్ పుస్తకాన్ని త్రిదండి చినజీయర్ స్వామి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాలతో పాటుగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేసుకోవాలని ఆలోచనతో ఆలయాల అభివృద్ధికి పూనుకున్నారని చెప్పారు. శ్రీ లక్ష్మి నర్సింహుడు కొలువైన యాదాద్రి దేశంలోని గొప్ప పుణ్యక్షేత్రాలలో ఒక్కటి రూపుదిద్దడం గొప్ప పరిణామం అని తెలిపారు. యాదాద్రితో పాటు రాములవారు కొలువైన భద్రాద్రి, రాజరాజేశ్వర సామి కొలువైన వెములవాడతో పాటు రాష్ట్రంలోని అన్ని చిన్న దేవాలయాల్లోనూ నిత్య పూజలు జరిగేలా ప్రభుత్వం కృషి చేయటం ఆధ్యాత్మిక లోకం ఆనందించే చర్య అన్నారు.
ప్రముఖ ఆలయాల పేర్లు ప్రతిభింబించేలా యాద్రాద్రి, భద్రాద్రి, రాజన్న, జోగులాంభ పేర్లతో జిల్లాలని ఏర్పాటు చేయటం గొప్ప విషయమని జియార్ స్వామి కొనియాడారు. కేసీఆర్ చిత్త శుద్ధితో చేస్తున్న ఆలయాల అభివృద్ధి చేసే కృషిని భవిష్యత్ తరాలు గుర్తు పెట్టుకుంటాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్ చేస్తున్న వివిధ రంగాల అభివృద్ధిని వరాదగిరి రావు 424 పేజిల ఈ బృహత్ గ్రంథంలో ఆవిష్కరించారని గ్రంథ రచాయితను అభినంధించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరిశంకర్ మాట్లాడుతూ స్వయంపాలనలో ఏడేండ్లలో జరిగిన అభివృద్ధిని కేసీఆర్ కృషికి అక్షర దృశ్యరూపంగా ఈ కాపిటేబ్‌ల్ బుక్ నిలిచిపోతుందని పేర్కొన్నారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వర్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దార్శనిక దృష్టికి ప్రతికగా, సాక్షిగా ఈ “ప్రగతి” గ్రంథం రచించారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత ఎన్.యాదగిరి రావుతో పాటు రామానంద తీర్థ గ్రామీణ విద్యాసంస్థ డైరెక్టర్ డాక్టర్ కిషోర్ పాల్గొన్నారు.