గౌరీ శంకర్ ను అభినందించిన సీఎస్ సోమేశ్ కుమార్

  • 'పచ్ఛా పచ్ఛాని పల్లె' అనే పుస్తకాన్నిఆవిష్కరించిన సిఎస్
హైదరాబాద్, డిసెంబర్ 27: దేశంలోనే పల్లె ప్రగతి పథకం అద్భుత ఆవిష్కరణ అని, గ్రామ స్వరాజ్యానికి ఇది ప్రాణం పోసిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులుగా ఇటీవల పదవీ భాద్యతలు స్వీకరించిన జూలూరు గౌరీ శంకర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను నేడు బీఆర్ కేఆర్ భవన్ లో మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్బంగా జూలూరు గౌరీ శంకర్  రచించిన 'పచ్ఛా పచ్ఛాని పల్లె' అనే పుస్తకాన్ని సీఎస్ సోమేశ్ కుమార్ ఆవిష్కరించారు. సీఎస్ సమాట్లాడుతూ, పల్లె ప్రగతి తో పల్లెల ముఖ చిత్రం మారిపోయిందని అన్నారు. పల్లెల ఆరోగ్యమే, దేశ సౌభాగ్యమని స్వచ్ఛ భారత్ లో తెలంగాణ అగ్రస్థానంలో నిలవడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రతీ పల్లె సర్వ స్వతంత్ర కేంద్రంగా నిలవడానికి ముఖ్యమంత్రి దార్శనిక ఆలోచనా ఎంతో దోహదం చేసిందన్నారు. స్ఫూర్తి దాయక పుస్తకాన్ని రచించిన జూలూరి గౌరీ శంకర్ ను సీఎస్ సోమేశ్ కుమార్ అభినందించారు. 

More Press News