ఆడపిల్లల పట్ల సమాజ ధోరణిలో మార్పు రావాలి: తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్

హైదరాబాద్: ఆడపిల్లల పట్ల సమాజ ఆలోచన విధానంలో మార్పు రావలసిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి అన్నారు. హైదరాబాద్ బషీర్ బాగ్ లో మంగళవారం మలబార్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన స్కాలర్ షిప్ కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. పూర్వ కాలం నుండే మహిళల్ని గౌరవించే సంప్రదాయమని, ఆ సంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలని సూచించారు.

ప్రభుత్వాలు, న్యాయస్థానాలు, చట్టాలు ఎన్ని చెప్పినా సామాజిక బాధ్యతగా స్త్రీ, పురుషుల మద్య గౌరవ భావాలు పెరగాలన్నారు. ప్రభుత్వాలు మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు, కమిషన్లు ఏర్పాటు చేస్తున్నాయని చైర్ పర్సన్ గుర్తు చేశారు. ఆ చట్టాల ద్వార మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని పరీక్షించడమే లక్ష్యంగా మహిళా కమిషన్ పని చేస్తూ అండగా నిలుస్తుందన్నారు. లింగ బేధాలతో పిల్లలను పెంచకూడదని, అడ, మగ పిల్లలకు సమాన హక్కు కల్పిస్తూ పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదీ అని సునీతా లక్ష్మారెడ్డి గుర్తు చేశారు.

కమిషన్ మహిళలకు రక్షణ హక్కులపై అవగాహన కల్పించడంతో పాటు మహిళలకు అండగా నిలుస్తుందన్నారు. ఆడపిల్లలు ధైర్యంగా తమ సమస్యను తామే ఎదుర్కొనే విధంగా ఎదగాలని పిలుపునిచ్చారు. మలబార్ సి.ఎస్.ఆర్. ద్వార చేస్తున్న ఐదు కార్యక్రమాలు ఎడ్యుకేషన్, హెల్త్, మహిళా సాధికారత, హౌసింగ్, పర్యావరణ వంటి సేవా కార్యక్రమాలు చేయడాన్ని సునీత లక్ష్మారెడ్డి అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలను మలబార్ విస్త్రతంగా కొనసాగించాలని సూచించారు.

ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో చదువుతున్న ఇంటర్ మొదటి సంవత్సరం మరి రెండో సంవత్సరంలో చదువుతున్న బాలికలకు వారి ఉత్తీర్ణతను బట్టి 5000 నుంచి 10000 వరకు మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇవ్వబడుతుంది. బాలికలను ప్రోత్సహించేందుకు ఇలాంటి ప్రోత్సాహాక కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. 

More Press News