ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యం కావాలి: వీఎంసీ కమిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్

  • ప్రధాన కార్యాలయంలో 24 అర్జీలు
  • సర్కిల్ కార్యాలయాలలో 10 అర్జీలు
విజ‌య‌వాడ‌: న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యంలో కమిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ సోమ‌వారం అధికారుల‌తో క‌లిసి నిర్వహించిన స్పందన కార్యక్రమములో ప్రజల నుండి అందిన అర్జీలపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తక్షణమే క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి పరిష్కరించవలెనని ఆదేశించారు. సదరు పరిష్కారము సంతృప్త స్థాయిలో ఉండవలెనని అర్జీదారులకు సదరు సమస్యలపై తీసుకొనిన చర్యల వివరాలను సహేతుకముగా వివరించవలెనని అధికారులను ఆదేశించారు.

కాగా నేటి స్పందన కార్యక్రమములో అదనపు కమిషనర్ (జనరల్) –2, ఇంజనీరింగ్ – 5, పట్టణ ప్రణాళిక - 6, పబ్లిక్ హెల్త్ – 8, యు.సి.డి విభాగం – 2, ఎస్టేట్ విభాగం – 1 మొత్తం 24 అర్జీలు స్వీక‌రించుట జరిగింది.

కార్యక్రమంలో అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారదాదేవి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయి, సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, మరియు ఇతర అధికారులు  పాల్గొన్నారు.

సర్కిల్ కార్యాలయాలలో స్పందన లో 10 అర్జీలు స్వీకరించిన జోనల్ కమిషనర్లు:
సర్కిల్ కార్యాలయాలలో జోనల్ కమిషనర్లు స్పందన కార్యక్రమము నిర్వహించగా సర్కిల్ – 1 కార్యాలయంలో ఇంజనీరింగ్ -1, సర్కిల్ - 2 కార్యాలయంలో ఇంజనీరింగ్ -3 అర్జీలు మరియు సర్కిల్ – 3 కార్యాలయంలో ఇంజనీరింగ్ -4, పబ్లిక్ హెల్త్ – 2 సంబందించి మూడు సర్కిల్ కార్యాలయాలలో మొత్తం 10 అర్జిలను జోనల్ కమిషనర్లు స్వీకరించారు.

More Press News