ప్రజా సమస్యల పరిష్కార వేదిక 'స్పందన': విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి

  • స్పందనలో 12 అర్జీలు స్వీకరణ
  • సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలి
విజ‌య‌వాడ‌: న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యంలో సోమవారం న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మిచే నిర్వహించిన స్పందన కార్యక్రమములో ప్రజలు ఎదుర్కోను పలు సమస్యలకు సంబందించి12 అర్జీల‌ను మేయర్ కి అందించారు.

అర్జీలు స్వీకరించిన మేయర్ ప్రజలు తెలిపిన సమస్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కాగా నేటి స్పందన కార్యక్రమములో ఇంజనీరింగ్ – 4, పట్టణ ప్రణాళిక - 5, పబ్లిక్ హెల్త్ –1, యు.సి.డి విభాగం – 1, ఎస్టేట్ విభాగము - 1 మొత్తం 12 అర్జీలు స్వీక‌రించినట్లు వివ‌రించారు.

కార్యక్రమంలో అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ, చీఫ్ ఇంజ‌నీర్ ప్ర‌భాక‌ర్ రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతభాయి, సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, ఏ.డి.హెచ్. జె.జ్యోతి, ఎస్టేట్ ఆఫీస్ డా.ఏ.శ్రీధర్  త‌దిత‌రులు పాల్గొన్నారు.

అదే విధంగా నగరపాలక సంస్థ పరిధిలోని మూడు సర్కిల్ కార్యాలయాలలో జోనల్ కమిషనర్లు నిర్వహించిన స్పందన కార్యక్రమములో సర్కిల్ – 1 కార్యాలయంలో – AC-1(రెవిన్యూ) సంబందించి-1 అర్జీ, సర్కిల్– 2 కార్యాలయంలో– పబ్లిక్ హెల్త్ సంబందించి-2 అర్జీలు మరియు సర్కిల్ – 3 కార్యాలయంలో ఎటువంటి అర్జీలు వచ్చియుండలేదని జోనల్ కమిషనర్లు తెలియజేశారు.

More Press News