కల్తీ లేదా కుళ్లిన మాంసం విక్రయిస్తే చట్ట పరమైన చర్యలు: వీఎంసీ కమిషనర్
విజయవాడ: నగర ప్రజలకు హాని కల్గించేలా కల్తీ లేదా కుళ్లిన మాంసం విక్రయాలు సాగించిన వారిపై చట్ట పరమైన చర్యలు తప్పవని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ హెచ్చరించారు. సింగ్ నగర్ ప్రాంతములో కల్తీ మాంసపు విక్రయాలు జరుగుతున్నాయని ప్రజల నుండి వచ్చిన సమాచారం మేరకు కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాలకు అనుగుణంగా ప్రజారోగ్య అధికారులు సిబ్బందితో కలసి ఆకస్మిక దాడులు నిర్వహించారు.
నగర పాలక సంస్థ వెటర్నరి అసిస్టెంట్ సర్జన్ డా.ఏ.రవిచంద్ ఆధ్వర్యంలో ఫుడ్ శానిటరీ ఇన్స్ పెక్టర్ గోపాల్ కృష్ణ, శ్రీకాంత్ మంగళవారం ప్రకాష్ నగర్, డాబా కోట్ల సెంటర్, అజిత్ సింగ్ నగర్ ప్రాంతాలలోని మాంసం దుకాణాలపై దాడులు నిర్వహించారు. ముఖ్యంగా కల్తీ మాంసం అమ్ముతున్నరనే ఆధారాలతో ఈ తనిఖి నిర్వహించారు. ప్రకాష్ నగర్ లో కుల్లిపోయిన మరియు చనిపోయిన కోళ్ళు లివర్, కందన కాయలు అమ్ముతున్న షాపు యజమానిపై రూ.4000/- జరిమానా విధించుటతో పాటుగా కల్తీ రంగులు కుడా పట్టుకున్నారు.
అదే విధంగా NM-Veg రెస్టారెంట్ నందు sypthic కెమికల్స్ పట్టుకున్నారు. ఆ రంగుల వల్ల హానికరం కెమికల్స్ వల్ల కాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నదని తేలింది. ట్రేడ్ లైసెన్సు మరియు ఫుడ్ లైసెన్సు లేని రెండు రెస్టారెంట్ల పైన ఫుడ్ ఇన్స్ పెక్టర్లు దాడులు నిర్వహించి ఒక్కోక్కరికి రూ.10,000/- చొప్పన జరిమాన విధించి వసూలు చేశారు. ఎవరైనా కల్తీ మాంసం మరియు కుళ్లిపోయిన మాంసం అమ్మిన యెడల చట్ట ప్రకారం చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఈ ప్రకటన ద్వారా కమిషనర్ హెచ్చరించారు.
నున్న లే అవుట్ హౌసింగ్ నిర్మాణ పనుల పురోగతి పరిశీలన:
పేదలకు ఇల్లు కార్యక్రమమునకు సంబంధించి నున్న లే అవుట్ నందు చేపట్టిన హౌసింగ్ నిర్మాణ పనుల యొక్క పురోగతిని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. ఈ సందర్బంలో ఈ ప్రాంతములో 954 ఇళ్ళకు గాను 335 ఇల్లు బేస్ మేట్ వరకు వచ్చాయని అధికారులు వివరించారు. నిర్మాణ పనుల వేగవంతంగా చేయుటకు తీసుకోవలసిన చర్యలపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సందర్బంలో అక్కడ విధి నిర్వహణలో ఉన్న వార్డ్ అడ్మిన్ లకు పలు ఆదేశాలు ఇచ్చారు. పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వీ.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
రోడ్ల ప్యాచ్ వర్క్ పనులు వేగవంతముగా పూర్తి చేయాలి: కమిషనర్
నగర పర్యటనలో భాగంగా కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అధికారులతో కలసి వన్ టౌన్ ప్రాంతములోని పలు ప్రదేశాలలో పర్యటించారు. సితార జంక్షన్ బైపాస్ రోడ్ నందు చేపట్టిన ప్యాచ్ వర్క్ పనులను మరియు రిలయన్స్ మార్క్ ప్రక్క రోడ్ నందు వేసిన సీసీ రోడ్ లను పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. దసరా ఉత్సవాల సందర్బంలో దుర్గ గుడికి వచ్చు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అదే విధంగా పారిశుధ్య నిర్వహణ విధానము డ్రెయిన్ లలో మురుగునీటి పారుదల మొదలగు అంశాలను పరిశీలిస్తూ, డ్రెయిన్లు ఎక్కడ పొంగి పొర్లకుండా చూడాలని మరియు రోడ్లు అన్నియు ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్ట్రీట్ ఫర్ పీపుల్ కార్యక్రమములో భాగంగా ఎన్.ఆర్.పి రోడ్ నందు చేపట్టిన అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.