ఈనెల 28న విజయవాడలో దాండియా మెగా ఈవెంట్!

  • సెప్టెంబర్ 28కి సన్నద్ధం అవుతున్న కళాకారులు
  • క్రియేటివ్ సోల్ నేతృత్వంలో నిరాటంకంగా మూడో సారి
  • ప్రముఖులు చేతుల మీదుగా లక్షలాది రూపాయల బహుమతులు

దాండియా వేడుకకు విజయవాడ నగరం సన్నద్ధం అవుతోంది. సెప్టెంబర్ 28వ తేదీన లబ్బీపేట ఎస్ఎస్ కన్వేన్వన్ సెంటర్ లో గార్బా, దాండియా 2019 మెగా ఈవెంట్ జరగనుండగా ఇందుకు అవసరమైన శిక్షణ చురుకుగా సాగుతోంది. చిన్నారుల మొదలు, యువతీ యువకులు, పెద్దలు విలువైన బహుమతులు గెలుచుకునేందుకు పోటీపడి మరీ అభ్యాసం చేస్తున్నారు. బెంజి సర్కిల్ సమీపంలో జ్యోతి కన్వెన్షన్ సెంటర్ లో నిరంతర శిక్షణా కార్యక్రమం జరగుతుండగా ఈ గార్భా, దాండియా నృత్యరీతుల కార్యశాలకు మంచి స్పందన లభిస్తోంది.

క్రియేటివ్ సోల్ కల్చరల్ సొసైటీ నేతృత్వంలో గత రెండు సంవ్సరాలుగా నగరంలో దాండియా వేడుక జరుగుతుండగా, ఇది మూడో సారి. 28వ తేదీ నాటి మెగా ఈవెంట్ లో దాండియా, గర్బా నృత్యాలతో పాటు గుజరాతీ సంగీత కళాకారుల పాటలు, వాద్య కళాకారులు వీనుల విందైన సంగీతం అందించనున్నారు. ప్రస్తుత కార్యశాలలో ఉదయం 10గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నిరాటంకంగా సాగుతున్న శిక్షణలో ఏదేని గంట నిడివిని ఔత్సాహిక కళాకారులు ఎంపిక చేసుకుని అభ్యాసం చేస్తున్నారు.

కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతులు, హోరెత్తించే వాద్యంలతో మెగా ఈవెంట్ ను ప్రత్యేకంగా డిజైన్ చేస్తుండగా, గుజరాతీ దుస్తులు, వస్త్రాలు, ఆభరణాలు, కళాకృతులు, చిత్రలేఖనాల ప్రదర్శనను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వివరాలకు 9849468498, 8317556636, 9121605288 నెంబర్లతో సంప్రదించవచ్చు. స్ధలాభావం వల్ల ఈవెంట్ ప్రవేశం కోసం నిర్ధేశించిన ఎంట్రీ టిక్కెట్లు పరిమితంగానే ఉన్నాయని, జ్యోతి కన్వెన్షన్ సెంటర్ లో 26 సాయంత్రం వరకు ప్రతీరోజూ సాయంత్రం ఐదు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఇవి అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

సాధారణంగా ఉత్తర భారతదేశానికే పరిమితం అయిన గార్బా, దాండియా నృత్యరీతులను ఆంధ్రప్రదేశ్ కు పరిచయం చేసే క్రమంలో తాము ఈ వర్క్ షాపును చివరగా మెగా ఈవెంట్ ను నిర్వహిస్తున్నామని క్రియోటివ్ సోల్ వ్యవస్ధాపకులు సుమన్ మీనా, నేహాజైన్ ఈ సందర్భంగా తెలిపారు. కళలతో దేశ సమైఖ్యతను చాటేలా గుజరాతీ, రాజస్ధానీ పడతులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి గత రెండు సంవత్సరాలుగా నగర వాసుల మంచి సహకారం అందిస్తున్నారన్నారు. విజయవాడ యువతీ యువకుల కోసం ప్రత్యేకంగా ప్రతీ సంవత్సరం 21 రోజుల పాటు దాండియా శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.

ఇందుకోసం జాతీయ స్ధాయిలో గుర్తింపు కలిగిన శిక్షకులను రప్పించామని సుమన్ మీనా తెలిపారు. ప్రదర్శనకారులలో పోటీతత్వాన్ని పెంపొందిస్తూ, ఉత్సాహభరిత ప్రదర్శనలను ప్రోత్సహించే క్రమంలో నిపుణత ప్రదర్శించిన కళాకారులకు రూ.లక్షకు పైబడిన బహుమతులను అందిస్తున్నామని నేహా జైన్ పేర్కొన్నారు. దుర్గాదేవికి మహిషాసురునికి మధ్య జరిగే యుద్దానికి ప్రతీకగా ఉత్తర భారత దేశంలో దాండియా ఆడతారని, అమ్మవారికి హారతి ఇచ్చే ముందు చిన్నా, పెద్ద కలిసి ఈ నృత్యం చేస్తారని నిర్వాహకులు వివరించారు. కార్యక్రమ ప్రధాన ప్రయోజకులుగా జీఎం మాడ్యులర్ వ్యవహరిస్తుండగా, సెప్టెంబరు 28 నాటి మెగా ఈవెంట్ కు ప్రమెషన్ గా ప్రతీవారం పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందిస్తున్నామన్నారు.


More Press News