పోషకాహారలోప నివారణే లక్ష్యంగా.. పోషకాహార బోనమెత్తిన మంత్రి సత్యవతి రాథోడ్
- అనేక రంగాల్లో దేశానికి మోడల్ గా ఉన్న తెలంగాణ అంగన్వాడీలో కూడా ఆదర్శంగా మారాలి
- పోషకాహారాన్ని అందించడం ద్వారా ఆరోగ్య తెలంగాణకు పునాదులు వేసి బంగారు తెలంగాణ లక్ష్యం సాధించాలి
- పోషణ్ మహ-2021 ముగింపు సమావేశంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్
సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ వ్యాఖ్యలు:
- పోషకాహారంపై పది శాఖల సమన్వయంతో నేడు గొప్ప సమావేశాన్ని నిర్వహించుకుంటున్న ఈరోజు సుదినం
- పోషకాహారంలో దేశానికి రోల్ మోడల్ గా ఉంటూ ఆరోగ్య తెలంగాణ సాధించాలని మన దగ్గర నుంచి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆశిస్తున్నారు. ఆ ఆశయ సాధనకు మనం పనిచేయాలి
- ఈ లక్ష్య సాధనలో మన శాఖను బలోపేతం చేయడంలో మనకు అన్ని శాఖల సహకారం లభిస్తోంది
- దేశాన్ని మహిళలు పాలించినా, అనేక మంది మహిళా నేతలు ముఖ్యమంత్రులుగా ఉన్నా.. వారు ఆలోచించని రీతిలో సీఎం కేసీఆర్ గారు ఇక్కడి మహిళల సమగ్ర వికాసం కోసం ఆలోచిస్తున్నారు
- మహిళల్లో ఎలాంటి ఆనారోగ్యం ఉందొద్దని, పోషకాహార లోపాన్ని నివారించాలని ఆరోగ్య లక్ష్మి పథకం తీసుకొచ్చారు. ఒకపూట కడుపు నిండా అన్నం పెడుతున్నారు
- కోవిడ్ రావడం...అన్ని శాఖల మీద ప్రభావం చూపింది. అయితే ఇతర శాఖలు పనులు ఆగిన అంగన్వాడీ సేవలు ఆపొద్దని సీఎం కేసీఆర్ గారు చెప్పారు
- ఇటీవల జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే జరిగినప్పుడు మనం పోషకాహారంలో వెనుకబడి ఉన్నామని వెల్లడించడంతో సీఎం కేసీఆర్ గారు వెంటనే స్పందించి ..పోషకాహారలోపాన్ని నివారించాల్సిందే అన్నారు. ఇందుకోసం ఎంత ఖర్చు అయినా వెనుకాడొద్దని, వెంటనే ఐఎఎస్, ఐపిఎస్ ల కమిటీ వేసి, అధ్యయనం చేయించారు. అంటే ఆయనకు మన పట్ల ఎంత ప్రేమ ఉందో దీనిని బట్టి మనం అర్ధం చేసుకోవాలి
- అంగన్వాడీలలో పనిచేస్తున్న మనం మొదట తల్లులం. మనం అధికారులుగా, ఉద్యోగులుగా కాకుండా బాధ్యతగా పని చేయడం ద్వారానే పోషకాహార లోపాన్ని నివారించగలం
- సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా స్మితా సబర్వాల్ గారు ఈ పోషకాహార లోపాన్ని నివారించడంలో మనకు అన్ని విధాల తోడ్పాటు అందిస్తున్నారు
- సీఎం కేసీఆర్ గారు అందరితో పాటు మనకు వేతనాలు పెంచారు. కాబట్టి మనం కూడా ఆయన ఆశించిన లక్ష్యాలు నెరవేర్చాలి. అందులో భాగంగానే మన శాఖలో ఉన్న ఖాళీలు కూడా భర్తీ చేస్తున్నాం
- కోవిడ్ వల్ల తల్లిదండ్రులు కోల్పోయిన వారికి ప్రభుత్వం ఏదైనా చేయాలి అంటే.. వారికే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న అనాథలందరికీ మరో కుటుంబం ఏర్పాటు అయ్యే వరకు ఈ ప్రభుత్వం అండగా ఉండాలని కేబినెట్ సబ్ కమిటీ వేశారు సీఎం కేసీఆర్ గారు
- తెలంగాణ రాష్ట్రం గర్భిణీ స్త్రీలకు అత్యంత సురక్షితమైన రాష్ట్రంగా ఉందని యునిసెఫ్ కితాబునిచ్చింది
- ఈ రాష్ట్రంలో కొత్తగా 12 మెడికల్ కాలేజీలు సీఎం కేసీఆర్ గారు ఇచ్చారు. ఆయా జిల్లాలోని ఏరియా హాస్పిటల్స్ మాతా శిశు దవాఖానాలుగా మార్చుతున్నాం. దీనివల్ల మాతా, శిశు ఆరోగ్య సంరక్షణలో మరింత మేలు జరగనుంది
- గతంలో బాల్య వివాహాలు బలవంతంగా ఆపితే ఆ కుటుంబాల నుంచి వ్యతిరేకత వచ్చేది. కానీ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 1,00,116 రూపాయలు ఇవ్వడం ద్వారా నేడు బాల్య వివాహాలు గణనీయంగా తగ్గాయి. బలవంతంగా కాకుండా వారికి మేలు చేయడం ద్వారా, ప్రేమ ద్వారా వీటిని ఆపాలన్న సీఎం కేసీఆర్ గారి ఆలోచన ఫలించింది
- అలాగే కేసీఆర్ కిట్ ఇవ్వడం ద్వారా ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు పెరిగి, మాతా, శిశు మరణాలు కూడా బాగా తగ్గాయి
- గతంలో మహిళలు బిందె తీసుకుని బావులు, చెరువులు దగ్గరికి వెళ్ళి వచ్చే వరకు ఇల్లు మొదలు కాకపోయేది. కానీ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి సురక్షితమైన నల్లా నీరు ఇవ్వడం ద్వారా మహిళలకు బాధలు తొలిగాయి
- రైతు బాగుపడాలని రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు ఇవ్వడం వల్ల నేడు మన రైతు దేశంలోనే అత్యధిక సాగు చేస్తున్నారు. రైతు బాగు పడడం వల్ల ఆ కుటుంబంలో మహిళా సంతోషంగా ఉంది
- కాబట్టి మీరు అంతా మనసు పెట్టి పని చేయాలి. సీఎం కేసీఆర్ గారు ఆశించిన లక్ష్యం నెరవేర్చాలి
- తెలంగాణ రాష్ట్రం గ్రోత్ మానిటరింగ్ బాగా చేస్తుంది. దీనిని దేశ వ్యాప్తంగా తెలంగాణ మోడల్ గా అమలు చేస్తామని కేంద్రం చెప్పింది
- మీ బాలామృతం బాగుంది. చాలా రాష్ట్రాలు దీనిని అడుగుతున్నాయి. త్వరలోనే దీనిని ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసేందుకు పనులు జరుగుతున్నాయి
- హరితాహరంలో ఇంటింటికి 6 చెట్లు పెట్టమని సీఎం కేసీఆర్ చెప్పడంతో రాష్ట్రంలో పచ్చదనం పెరిగింది. అలాగే పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రతి ఇంటికి న్యూట్రి గార్డెన్ పెట్టుకునేలా మనమంతా చైతన్యం కల్పించి, పనిచేయాలి
- పోషకాహర లోపాన్ని నివారించేంత వరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం పెట్టుకుని సమీక్ష చేసుకుందాం. కాబట్టి సంక్రాంతికి మరో సమావేశం పెట్టుకుందాం. అప్పటికి పోషకాహార లోపం నివారణలో ఎంత ప్రగతి సాధించామో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి స్పష్టంగా చెప్పేలా పనిచేయాలి
- గద్వాలలో పోషకాహార లోపాన్ని రెండు నెలల్లో గణనీయంగా తగ్గించగలిగాము. ఇందులో గిరిపోషణ బాగా ఉపయోగపడింది. దీనిని త్వరలో మరో ఏడు జిల్లాలకు విస్తరిస్తున్నాం. పోషకాహార లోపం ఉన్న వారిని గుర్తించి, వారికి మరింత పోషకాహారాన్ని అందించాలి
- సీఎం ఆశించిన బంగారు తెలంగాణ సాధనలో మనం పూర్తిగా భాగస్వామ్యమై పని చేయాలి
- తెలంగాణ అనేక రంగాల్లో దేశానికి రోల్ మోడల్
- తెలంగాణ అంగన్వాడి కూడా దేశానికి రోల్ మోడల్ కావాలి
- ఇప్పటికే రాష్ట్రం సాధించుకుని 7 ఏళ్లు గడిచాయి. ఇకపై మన దగ్గర పోషకాహర లోపం అనే పదం కూడా వినిపించకూడదు
- పోషకాహార లోపం లేని తెలంగాణ కావాలి. ఇదే మన గీతం..నినాదం కావాలి. ఈ స్పూర్తితో పని చేయాలి
- ఎలాంటి పోషకాహారాన్ని తినాలి అని యూనిసెఫ్ వచ్చి మనకు నేర్పించాలా? 1975 లో పుట్టిన ఐసీడీఎస్ శాఖ ఎన్నో సాధించింది. ఇంకెంత కాలం మనం ఇతరుల నుంచి నేర్చుకుందాం. మన నుంచి నేర్చుకునేలా మనం తయారు కావాలి
- మన పిల్లలు ఆరోగ్యంగా ఉండడం అనేది మనకు గర్వ కారణం కావాలి. కేరళలో పోషకాహార లోపం లేకపోవడానికి కారణం వారు వారి ప్రాంతంలో ఆరోగ్యంగా ఉండడం ఒక గర్వకారణంగా భావించడమే
- మన దగ్గర 3 లక్షల మంది పోషకాహార లోపంతో ఉన్నారు. ఇది జీరోకు రావాలి
- జిల్లా కలెక్టర్లు ఇకపై దీని మీద దృష్టి పెట్టి మీకు సహకరిస్తారు
- 56 లక్షల మంది కుటుంబాలకు మిషన్ భగీరథ నీరు ఇచ్చాం. చివర్లో ఉన్న గిరిజన కుటుంబానికి కూడా ఈ నీరు ఇవ్వగలుగుతున్నాం. గొప్ప సదుపాయం సమకూర్చగలిగాం
- శుద్ది చేసిన తాగు నీరు ఇవ్వడం అంటే ఆరోగ్యం ఇవ్వటమే
- ఇక మనం ఇవ్వాల్సింది పోషకాహారం మాత్రమే
- పక్కగా గ్రోత్ మానిటరింగ్ చెయ్యాలిపల్లె ప్రగతి వలె.. పోషణ ప్రగతి కూడా మనం చేసుకోవాలి. మనం కష్టపడడం వల్ల అది జరుగుతుంది
- 2022 డిసెంబర్ నాటికి పోషకాహార లోపం లేని తెలంగాణ మనం చూడాలి
ఈ కార్యక్రమానికి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి దివ్య దేవరాజన్ అధ్యక్షత వహించగా, యునిసెఫ్ ప్రతినిధులు మీటెల్ రస్డియా, డాక్టర్ ఖ్యాతి తివారి, గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, ఎన్.ఐ.ఎన్, పంచాయతీ రాజ్, ఆరోగ్య శాఖ, మిషన్ భగీరథ శాఖల అధికారులు పాల్గొన్నారు.