త్వరలో అందుబాటులోకి వెట‌ర్న‌రీ కాల‌నీ పార్క్: వీఎంసీ క‌మిష‌న‌ర్

విజ‌య‌వాడ‌: న‌గ‌రంలో ప‌చ్చ‌ద‌నం పెంపొందించాల‌ని, చిన్నారుల‌కు ఆకర్షించే విధంగా అత్యంత సుంద‌రంగా పార్క్ ల‌ను అభివృద్ది చేస్తున్న‌ట్లు న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ పేర్కొన్నారు. శుక్ర‌వారం న‌గ‌ర పాల‌క సంస్థ అధికారుల‌తో క‌లిసి క‌మిష‌న‌ర్ 4వ డివిజ‌న్ గురునాన‌క్ కాల‌నీ, వెటర్నర్ కాల‌నీ త‌దిత‌ర ప్రాంతాల‌ను ప‌ర్య‌టించారు.

వెటర్నర్ కాలనీ చుట్టు ప్ర‌క్క‌ల ఉన్న 4 మీట‌ర్లు బీటి రోడ్డును 5 -1/2 వెడ‌ల్పు చేసి బి.టి రోడ్డుగా అభివృద్ధి పరచాలని అధికారుల‌కు అదేశించారు. అదే విధంగా ఈ ప్రాంతంలో ఉన్న మ‌ట్టి దిబ్బ‌ల‌ను, ర్యాంపుల‌ను  పూర్తిగా తొల‌గించాల‌న్నారు. డ్రైన్లు పూడిక‌ తీయుపనులు పూర్తి చేయాల‌న్నారు. వెటర్నర్ కాల‌నీ 10ల‌క్ష‌ల రూపాల‌య‌ల‌తో ఏర్పాటు చేయ‌నున్న ఇండోర్ జిమ్‌, ఓపేన్ జిమ్ ప‌నులు పూర్తి చేయాల‌న్నారు. పార్కును ఈ నెల ఆఖ‌రులోపు పూర్తి చేసి, వ‌చ్చే నెల నుంచి సంద‌ర్శ‌కుల‌కు అనుమ‌తించాల‌ని అధికారుల‌ను క‌మిష‌న‌ర్ ఆదేశించారు. ఆయా ప్రాంతములో పారిశుధ్య నిర్వహణ విధానము, చెత్త సేకరణ మొదలగు అంశాలతో పాటుగా డ్రెయినేజి పంపింగ్ స్టేషన్ యొక్క పనితీరును పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ప‌ర్య‌ట‌న‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.చంద్ర శేఖర్, హెల్త్ ఆఫీసర్ డా.శ్రీ దేవి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రంగారావు మరియు శానిటరీ అధికారులు మరియు స్థానిక కాలనీ వసూలు తదితరులు పాల్గొన్నారు.

More Press News