కెఎల్ రావు పార్క్ ఆధునికీకరణ పనులు: విజయవాడ మేయర్
విజయవాడ లంబాడి పేట నందలి డా.కెఎల్ రావు పార్క్‌ను నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మ బుధవారం అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక నేతలు, అధికారులతో మేయర్ మాట్లాడారు. ముందుగా స్కేటింగ్ కోసం ప్లొరింగ్‌ను సిద్దం చేయాలని, బోటింగ్‌ను వాడుకలోని తీసుకురావడానికి చర్యలు చేపట్టాలన్నారు. పార్క్ లో ఎక్కువ భాగంగా లోతట్టుగా ఉండటాన్ని గమనించిన మేయర్ ఎత్తుపల్లాలు లేకుండా సరిచేయాలన్నారు.
మోటర్‌లు బోట్లకు తగిన రిపేరు చేయించాలన్నారు. పార్క్ నందలి అవసరమైన చోట్ల అందమైన టైల్స్‌తో ఆకర్షనీయంగా ఆధునికీకరించాలన్నారు. అదే విధంగా చిన్నారుకుల ఆట వస్తువుల ఏర్పాటు చేయాలన్నారు. తర్వలోనే పూర్తిస్థాయిలో పార్కును అభివృద్ధి చేస్తామన్నారు. పార్క్ ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించి ఆవరణ అంతయు గ్రీనరి అభివృద్ధి పరచుటతో పాటుగా ఎత్తుగా పెరిగిన మొక్కలు ట్రిమ్మింగ్ చేయాలని మరియు పార్క్ ఆవరణలో వ్యర్ధములను తొలగించి పార్క్ ఆవరణ పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.
కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.నారాయణమూర్తి, ఉద్యాన అధికారి జె.జ్యోతి, ఎస్టేట్ అధికారి ఎ.శ్రీధర్ మరియు ఇతర అధికారులు సిబ్బంది వై.ఎస్.ఆర్. పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.