కోటి రూపాయ‌ల‌తో డీఆర్ఆర్ ఇండోర్ స్టేడియం ఆధునికీకరణ ప‌నులు: వీఎంసీ క‌మిష‌న‌ర్

  • సంక్షేమ ప‌థ‌కాను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందే
  • 111, 112 సచివాలయాల‌ ఆకస్మిక తనిఖీ
విజయవాడ: ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ‌ పథకాలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిపై ఉందని క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ పేర్కొన్నారు. గురువారం కృష్ణలంక 23వ డివిజ‌న్‌లోని 111, 112 స‌చివాల‌యాల‌ను క‌మిష‌న‌ర్ ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది హాజరు పట్టిక, మూవ్‌మెంట్‌ రిజిస్టర్‌ను పరిశీలించారు.

సచివాలయంలోని రికార్డులను పరిశీలించి, సిబ్బందికి తగిన సూచనలు చేశారు. అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. ఉద్యోగుల హాజరు శాతం, సచివాలయానికి వచ్చే ప్రజల సమస్యలపై ఇచ్చే దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కోటి రూపాయ‌ల‌తో డిఆర్ఆర్ స్టేడియం ఆధునికీకరణ ప‌నులు: 15 రోజుల్లో నిర్మాణ‌ ప‌నులు పూర్తి చేయాల‌ని అధికారుల‌కు క‌మిష‌న‌ర్ ఆదేశం

బంద‌ర్‌ రోడ్డులోని డిఆర్ఆర్ ఇండోర్ స్టేడియంలో జ‌రుగుతున్న అభివృద్ది ప‌నుల‌ను అధికారుల‌తో క‌లిసి క‌మిష‌న‌ర్ ప‌రిశీలించారు. కోటి రూపాయ‌ల‌తో ఆధునికీకరణ ప‌నుల్లో భాగంగా జిమ్, 4 ష‌టిల్ కోర్టు నిర్మాణ ప‌నులు, స్టేడియం లోప‌ల బ‌య‌ట పెయింగ్ ప‌నులు, గ్యాల‌రీ నిర్మాణం, స్టేడియంలో ఉడేన్ పోలింగ్ నిర్మాణం ప‌నుల‌ను 15 రోజులోగా పూర్తి చేయాల‌ని అధికారుల‌కు క‌మిష‌న‌ర్  ఆదేశించారు.

పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.చంద్ర శేఖర్, ఆర్.ఎఫ్.ఓ/స్పోర్ట్స్ ఆఫీసర్ ఇన్ ఛార్జ్ ఉదయ కుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫణింద్ర మరియు ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరమత్తులు చేపట్టవలసిన క్లాసు రూమ్ లకు అంచనాలు రూపొందించాలి: అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ‌
పాఠశాలల్లో అత్యవసర సౌకర్యాలు కల్పించుటకు చేపట్టవలసిన చర్యలపై గురువారం నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ‌ తనిఖి చేశారు. నగర పరిధిలోని మూడు పాఠశాల్లో శిథిలమైన భవనాలైన దుర్గాపురంలోని శ్రీ T.వెంకటేశ్వరరావు ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాలలను సందర్శించి పెచ్చులూడిన గదులను, దెబ్బతిన్న కిటికీలు – గోడలను పరిశిలించి వెంటనే వార్డ్ ఎనిమిటిస్ సెక్రటరి అబ్దుల్ రహీమ్ కు ఎస్టిమేషన్ వేసి పంపవలసినదిగా ఆదేశించారు. హైస్కూల్ మరియు ప్రైమరీస్కూల్ తరగతుల విద్యార్ధులు మరియు టిచర్లతో ముచ్చటించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం సత్యనారాయణపురంలోని ప్రశాంతి ప్రాథమిక పాఠశాల మరియు AKTPM హైస్కూల్ సందర్శించి అక్కడ ఎనిమిటిస్ సెక్రటరి నాగరాజుకు కూడా ఎస్టిమేషన్ వివరాలు సేకరించారు. AKTPM హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు S.శ్రీనివాసరావు పాఠశాలలో 1850 మంది విద్యార్ధులతో అదనపు తరగతుల అవసరమని ప్రస్తావించగా వెంటనే ప్రపోజల్స్ పంపవలసినదిగా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ప్రతి పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు అందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాల కార్యక్రమాలు నిర్వహించాలని, మద్యాహ్నం భోజన సమయంలో పరిశుభ్రత మరియు సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యకమoలో పాఠశాలల సూపర్వైజర్లు, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గోన్నారు.

More Press News