కేంద్రమంత్రిని కలిసిన మంత్రి మల్లారెడ్డి
న్యూ ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి దేశ రాజధాని ఢిల్లీలో నేడు కేంద్ర విద్యా శాఖ నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. తదనంతరం నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపునందు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిన మిగులు బడ్జెట్ ను విడుదల చేయవలసిందిగా వారిని కోరారు. స్కిల్ డెవలప్మెంట్ మరియు ఎంటర్ ప్రెన్యూర్ షిప్ శాఖ ఆధీనంలో గల డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ ద్వారా అమలు చేయవలసిందిగా కోరారు.
కేంద్ర ప్రాయోజిత పథకాలలో మొత్తం రూపాయలు 16.57 కోట్లు పెండింగ్ లో కలవని వాటిని త్వరలో విడుదల చేసి నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరారు.
ఆ తర్వాత కేంద్ర కార్మిక ఉపాధి అవకాశాలు మరియు కేంద్ర పర్యావరణం అడవులు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ను పర్యావరణ భవన్ నందు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తర్వాత కార్మిక ఉపాధి శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తరాల ద్వారా మీకు పూర్వమే తెలపడం జరిగిందని, ESIC వద్ద 2019-20 సంవత్సరానికి సంబంధించిన బ్యాలెన్స్ 104.50 మొత్తాలను మీ దృష్టికి తీసుకురావడం జరిగిందని చర్చించారు.