తెలంగాణ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ సమావేశం

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం బి.ఆర్.కె.ఆర్ భవన్‌లో తెలంగాణ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, ఉద్యోగ ఎంప్లాయీస్ యూనియన్స్ మరియు అధికారులతో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కేడర్ స్ట్రెంత్ కేటాయింపుపై సమావేశం నిర్వహించారు.

జిల్లా, జోనల్ మరియు మల్టీ జోనల్ క్యాడర్‌లకు సిబ్బంది కేటాయింపును విజయవంతంగా పూర్తి చేయడానికి సహకారం అందించడంతో పాటు సలహాలు సూచనలు, అభిప్రాయాలను తెలుపాలని వారిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు.

పీఆర్‌సీ అమలు, ఉద్యోగులతో స్నేహపూర్వక విధానాలను పాటిస్తున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు ఉద్యోగ సంఘాలు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాయి. ఉద్యోగుల సంఘాలు వివిధ క్యాడర్‌లకు అధికారుల కేటాయింపు గురించి తమ అభిప్రాయాలను తెలియజేశాయి. ఇతర సహచరులు మరియు యూనిట్‌లను సంప్రదించిన తర్వాత 12.08.2021న తగు సూచనలతో తిరిగి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశం కానున్నట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి.

ఈ సమావేశంలో జి.ఎ.డి. ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, జి.ఎ.డి, ఓఎస్డీ అప్పారావు, హెచ్ఆర్ఎం & ఎస్ఈఆర్ సీనియర్ కన్సల్టెంట్ శివ శంకర్, ఆర్ధిక శాఖ అదనపు కార్యదర్శి రవి, హోం శాఖ ఎస్ఓ వనజ, ఓఎస్డీ టు సీఎం సెక్రటెరీ కృష్ణ మూర్తి, టీజీఓ ల అసోసియేషన్ ప్రెసిడెంట్ మమత మరియు టీఎన్జీఓ అసోసియేషన్ ప్రెసిడెంట్ మామిళ్ల రాజేందర్ హాజరయ్యారు.

More Press News