బెజవాడ కనకదుర్గమ్మ అమ్మ వారిని దర్శించుకున్న తెలంగాణ ఎస్ఈసీ పార్థసారథి దంపతులు

  • ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికిన దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థాన అర్చకులు, ఈ.ఓ.భ్రమరాంబ, పూర్వపు ఈ.ఓ.కోటేశ్వరమ్మ
విజయవాడ: అమ్మవారికి పవిత్ర మాసం అయిన ఆషాడ మాసం శాకాంబరీ ఉత్సవాల సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని  శుక్రవారం సాయంత్రం తెలంగాణ ఎస్ఈసీ దంపతులు సి.పార్థ సారథి, శోభా పార్థసారథి, కుటుంబ సభ్యులు దర్శనం చేసుకుని,  భక్తి ప్రపత్తులతో కనకదుర్గమ్మ అమ్మవారికి ఆషాడం సారె సమర్పించి, మొక్కలు తీర్చుకున్నారు.

అనంతరం ఆలయ ప్రాంగణంలోని మల్లికార్జున మహా మండపంలో ప్రోటోకాల్ ప్రకారం ఆలయ వేదపండితులు, అర్చకులు  తెలంగాణ ఎస్ఈసీ సి. పార్థసారథి దంపతులు, కుటుంబ సభ్యులకు వేదాశ్వీర్వచనం చేయగా  ఈ.ఓ.భ్రమరాంబ కనకదుర్గమ్మ అమ్మవారి లడ్డూ ప్రసాదాలను, అమ్మవారి చిత్రపటాన్ని సి.పార్థసారథి దంపతులకు అందించారు.

అనంతరం ఆలయ గోపురం బయట ప్రత్యేక మండపంలో వివిధ రకాల కూరగాయలతో అలంకరించిన శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వార్ల ప్రతిమలను తెలంగాణ ఎస్ఈసీ సి.పార్థసారథి దంపతులు, కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈ.ఓ. భ్రమరాంబ కనకదుర్గమ్మ అమ్మవారి శాకాంబరీ ఉత్సవాల ప్రాముఖ్యతను ఎస్ఈసీ  దంపతులు సి.పార్థసారథి, శోభ పార్థసారథి, కుటుంబ సభ్యులు వేణు మాధవ్, పద్మజాక్షి తదితరులకు వివరించారు.

కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం ఈ.ఓ. భ్రమరాంబ, పూర్వపు ఈ.ఓ. మరియు ప్రస్తుతం ప్రణాళిక శాఖ జాయింట్ సెక్రటరీ కోటేశ్వరమ్మ, సమాచార శాఖ అడిషనల్ డైరెక్టర్ స్వర్ణలత, ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ కార్యాలయ జేడీ సాయి, రెవెన్యూ, పోలీసు, దేవాదాయ శాఖల ఉన్నతాధికారులు స్థానిక తాశీల్దార్ మాధురి తదితరులు కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థాన దర్శన సమయంలో ప్రోటోకాల్ ప్రకారం తెలంగాణ ఎస్ఈసీ సి.పార్థసారథి దంపతుల వెంట ఉన్నారు.

More Press News