డెంగ్యూ నివారణకు డా. కెకె అగర్వాల్ సూచనలు!
డెంగ్యూ మరణాలను నియంత్రించడానికి చికిత్సకన్నా ముందు నివారణ తప్పనిసరిగా అనుసరించాలి
తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్న ప్రజలలో చక్కటి ప్రభావాన్ని డాక్సిసైక్లిన్ చూపుతున్నట్లుగా నిర్థారణ
ఇటీవలి కాలంలో విడుదలైన నివేదికల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ వల్ల మరణించిన వారి సంఖ్య 50కు చేరింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి ప్రతి రోజూ డెంగ్యూ కేసుల నమోదవుతూనే ఉన్నాయి. దోమకాటు వల్ల డెంగ్యూ జ్వరం వస్తుంది. తీవ్రమైన ఫ్లూ తరహా లక్షణాలతో పాటుగా మృత్యువాత పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అందువల్ల తక్షణమే ఈ జ్వరం లక్షణాలు, దాని చికిత్స, దీనిని నివారించగలిగే విధానం గురించి అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది.
దీని గురించి పద్మశ్రీ అవార్డు గ్రహీత, డాక్టర్ కెకె అగర్వాల్, అధ్యక్షుడు, హార్ట్‌కేర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (హెచ్‌సీఎఫ్ఐ) మాట్లాడుతూ "ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తోన్న దోమకాటు వ్యాధి డెంగ్యూ, ఈ వ్యాధి బారిన పడిన కొద్దిగా లక్షణాలు కనబడటం లేదంటే అసలు కనిపించకపోవడమూ ఉంటుంది. ఈడిస్ ఈజిప్టి దోమ నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో తమ సంతానం వృద్ధి చేసుకుంటుంది. ఇండియాలో ఈ దోమ వృద్ధి చెందేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి.
ఈ డెంగ్యూ కేసులను తగ్గించేందుకు అనుసరించాల్సిన అతి ముఖ్యమైన మార్గం నివారణ. నీరు నిల్వ ఉండేందుకు ఆస్కారమున్న పాత వస్తువులను ముందుగా వదిలించుకోవాలి. ఈ దోమల సంతతి వృద్ధి చెందేందుకు సంభావ్య కేంద్రాలవి. పగటి పూట ఈడెస్ దోమలు కుడతాయి. ఇండోర్‌లో తాజా నీటిలో మాత్రమే తమ సంతానం వృద్ధి చేసుకుంటాయనేది పూర్తిగా నిజం కాదు. ఈ దోమ ఏ నీటిలో అయినా సంతానం వృద్ధి చేసుకోవడంతో పాటుగా సాయంత్రాలు, రాత్రి కూడా కాటు వేస్తుంది.
రోజంతా కూడా నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంది. ఎందుకంటే, ఈ దోమలు కాంతిని మాత్రమే గుర్తిస్తాయి తప్ప అది పగలు లేదా రాత్రి అనేది కాదు. ఇటీవల చేసిన అధ్యయనంలో దోమల ద్వారా వ్యాప్తిచెందే మలేరియా లేదా లెప్టోస్పిరోసిస్ లాంటి వ్యాధులలో సమర్థవంతంగా పనిచేసే డాక్సీసైక్లిన్, డెంగ్యూలో సైతం ప్రభావవంతంగా పనిచేస్తుందని తేలింది'' అని అన్నారు.
డాక్టర్ కెకె అగర్వాల్ మరింతగా మాట్లాడుతూ "దోమల బ్రీడింగ్ సైకిల్ 7 నుంచి 12 రోజుల కాలంలో పూర్తవుతుంది. అందువల్ల, ఇంటిని సరిగా శుభ్రపరుచుకోవడం, చుట్టుపక్కల ప్రాంతాలను వారానికోమారు అయినా శుభ్రపరుచుకోవడం అవసరం. పండుగ సీజన్‌లో మన దేశంలో ఇంటిని శుభ్రపరుచుకోవడంతో పాటుగా పనికిరాని వస్తువులను పారేయడం లేదా ఎవరికైనా ఇచ్చేయడం సంప్రదాయంగా ఆచరిస్తున్నారు. అదే తరహా దీపావళి తరహా పరిశుభ్రతా చర్యలను వర్షాకాలం ఆరంభానికి ముందు అనుసరించడం ద్వారా దోమల సంతతి వృద్ధి చెందకుండా అడ్డుకోవచ్చు'' అని అన్నారు.
ఫిజీషియన్లు తప్పనిసరిగా 20 ఫార్ములాను తక్కువ, తీవ్రస్థాయి డెంగ్యూ కేసుల నడుమ వైవిధ్యతను గుర్తించడంలో అనుసరించాలి. ఒకవేళ రోగి నాడి సాధారణం కన్నా 20 ఎక్కువగా; పైన బీపీ 20 కన్నా ఎక్కువగా పడిపోతే ; లోయర్, అప్పర్ బీపీ నడుమ తేడా 20 కన్నా తక్కువగా ఉంటే, ప్లేటలెట్స్ వేగంగా పడిపోవడం 20వేల కన్నా తక్కువగా ఉండి హెమాటోక్రిట్‌లో 20% ఎక్కువగా వృద్ధి ఉండటంతో పాటుగా టర్నిక్యుట్ పరీక్ష తరువాత చేతిపై 20 హెమరాజిక్ స్పాట్స్ ఉంటే అది ఆ రోగి హై రిస్క్ పరిస్థితుల్లో ఉన్నట్లే. ఆ వ్యక్తికి ఓ కేజీ బరువుకు 20 మిల్లీ లీటర్ల ఫ్లూయిడ్‌ను తక్షణమే అందించడంతో పాటుగా వైద్య పరంగా శ్రద్ధ అవసరం.
డెంగ్యూను నివారించవచ్చు, నిర్వహించనూవచ్చు. 1% కన్నా తక్కువ కేసులలోనే తీవ్రమైన సమస్యలు వస్తుంటాయి. హెచ్చరిక ప్రమాదాలను ప్రజలు గుర్తించినట్లు అయితే డెంగ్యూ వల్ల ఎదురయ్యే మరణాలను పూర్తిగా నివారించవచ్చు. అత్యధిక ప్రమాద స్ధాయి కలిగిన డెంగ్యూ రోగులకు డాక్సీ సైక్లిన్ సూచనీయమని అధ్యయనాలు చెబుతున్నాయి.
డెంగ్యూ నివారణకు సూచనలు:
ఇంటి చుట్టు పక్కల నీరు నిల్వ ఉండకుండా చూడాలి. మనీ ప్లాంట్ కుండీలు లేదా సరిగా కప్పని నీటి ట్యాంకులలో కూడా దోమలు గుడ్లు పెట్టవచ్చు
పూర్తిగా కప్పి ఉంచేలా వస్త్రాలు ధరించాలి
దోమ తెరలు /దోమ నివారణ మందులు పగలు మరియు రాత్రి వాడాలి